యూనిఫైడ్ లాంచ్ వెహికిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యూనిఫైడ్ లాంచ్ వెహికిల్ (ULV), భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక మాడ్యులార్ ఆర్కిటెక్చరును రూపొందించి, తదనుగుణంగా ఒక ఉపగ్రహ వాహక నౌకను తయారు చెయ్యడం. అంతిమంగా ఈ నౌక  పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి మార్క్ I/II, ఎల్‌విఎమ్3 ల స్థానాన్ని స్వీకరిస్తుంది.[1] ఈ డిజైనులో ఒక భారీ వాహక నౌక, HLV రూపకల్పన కూడా ఉండే అవకాశం ఉంది.

రూపకల్పన[మార్చు]

2013 మే నాటికి వెల్లడైన వివరాల ప్రకారం, డిజైనులో ఒక కామన్ కోర్, కామన్ అప్పర్ దశ ఉండగా, నాలుగు వేర్వేరు బూస్టరు సైజులు ఉన్నాయి[2]. నాలుగు బూస్టరు రకాలూ ఘన ఇంధన మోటార్లను కలిగి ఉంటాయి. ఈ నాలుగింటిలో కనీసం మూడు రకాలు ప్రస్తుతమున్న పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి, మార్క్ I/II, ఎల్‌విఎమ్3 లు వాడుతున్న మోటార్లను వాడుతాయి[3]. SC160 (160 టన్నుల ప్రొపెల్లెంట్ గల సెమీ-క్రయోజెనిక్ దశ) అనే కోర్‌ దశలో 160 టన్నుల కిరోసిన్ / LOX ప్రొపెల్లెంట్ ఉంటుంది. ఈ దశను ఒక SCE-200 ఇంజను నడుపుతుంది. C30 (30 టన్నుల ఇంధనం గల క్రయోజెనిక్ దశ) అనే అప్పర్‌ దశలో 30 టన్నుల LH2 / LOX ప్రొపెల్లెంట్ ఉంటుంది. దీన్ని CE-20 ఇంజను నడుపుతుంది[1][4].

నాలుగు బూస్టరు వికల్పాలు :

  • 6 × S-13:  ప్రస్తుతం పిఎస్‌ఎల్‌విలో ఉన్న S-12 కంటే కొద్దిగా పెద్దవి. ఇవి వాటి కంటే ఎక్కువ సేపు మండుతాయి;
  • 2 × S-60: కొత్త ఘన బూస్టర్ల లాగా కనిపిస్తున్నాయి;
  • 2 × S-139: ప్రస్తుత పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి Mk I/II ల మొదటి దశ
  • 2 × S-200: ఎల్‌విఎమ్3లో వాడుతున్నవి

9 టన్నుల ఉపగ్రహాలను భూ స్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టగల భారీ వాహక నౌక (HLV) లో కింది అంశా లుండవచ్చు:[1][4]

  • రెండు S-250 ఘన ఇంధన బూస్టర్లు - ప్రస్తుతం ఎల్‌విఎమ్‌3 లో వాడే S-200 కంటే పెద్దవి;
  • సెమీ-క్రయోజెనిక్ కోర్ దశ, SCE-200 ఇంజనుతో ఎల్‌విఎమ్‌3లో లాగా;
  • సెమీ క్రయోజెనిక్ మూడవ దశ, CE-50 ఇంజనుతో;
  • కొత్త నాలుగో దశ, C10 ఇంజనుతో.[5]

పోల్చదగ్గ రాకెట్లు[మార్చు]

  • అంగారా
  • అట్లాస్ V
  • డెల్టా IV
  • H3

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Brügge, Norbert. "ULV (LMV3-SC)". B14643.de. Retrieved 2015-08-14
  2. ఇస్రో యూనిఫైడ్ లాంచ్ వెహికిల్ అప్‌డేట్
  3. "ISRO Unified Launch Vehicle (ULV)". NASAspaceflight. 2013-05-03. Retrieved 2015-08-14
  4. 4.0 4.1 Brügge, Norbert. "LVM3, ULV & HLV". B14643.de. Retrieved 2015-08-14.
  5. ""Indigenous Development of Materials for Space Programme" By Dr A. S. Kiran Kumar Presentation Slides. Indian Institute Of Science iisc.ernet.in Date: 21 August 2015".

బయటి లింకులు[మార్చు]