యెరెవాన్ షాంపైన్ వైన్స్ ఫ్యాక్టరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెరెవాన్ షాంపైన్ వైన్స్ ఫ్యాక్టరీ
Typeజాయింట్-ష్టాక్ కంపెనీ
పరిశ్రమడ్రింకులు
స్థాపన1939
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం,
Areas served
ప్రాంతాల సేవలు
Key people
ఫియామెటా హకోబ్యాన్ (ఎక్సుగ్యూటివ్ మ్యానేజరు)
Productsఆల్కాహాల్
Ownerహ్రాయ్ర్ హకోబ్యాన్ (పెద్ద వాటాదారుడు)

యెరెవాన్ షాంపైన్ వైన్స్ ఫ్యాక్టరీ (యెరెవానీ షంపాయ్న్ జినినెరీ గోర్ట్సారన్) ను, "అర్మ్-షాంపైన్"అని కూడా పిలుస్తారు. ఇది ఆర్మేనియాలో షాంపైన్ ఉత్పత్తి చేసే ప్రముఖ సంస్థ. ఈ ఫ్యాక్టరీ 1939 లో సోవియట్ కాలంలో ప్రారంభించబడింది. ప్రారంభంలో, అది ఒక తీపి, పొడి వైన్స్ ఫ్యాక్టరీగా ఏర్పడినది. 1954 లో, ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తిని స్పార్క్లింగ్ వైన్స్ కు విస్తరించారు.[1] 1995లో సోవియట్ పాలన పతనం తరువాత, ఈ వైన్ల ఫ్యాక్టరీను ప్రైవేటీకరణ చేసి, ఓపెన్ జాయింట్-స్టాక్ కంపెనీ గా మార్చారు.[2]

ఈ ఫ్యాక్టరీ కనాకర్-జేత్యున్ జిల్లాలోని ట్బైలీసీ హైవే 20 పైన ఉన్నవి.[3]

ఉత్పత్తులు, బ్రాండ్లు[మార్చు]

యెరెవాన్ షాంపైన్ వైన్స్ ఫ్యాక్టరీ

ప్రస్తుతం, ఫ్యాక్టరీ సామర్థ్యం ఉత్పత్తి సంవత్సరానికి 10 మిలియన్ సీసాలుగా ఉన్న ది. ఫ్యాక్టరీ పూర్తి స్థాయి స్పార్క్లింగ్ వైన్లును తయారుచేస్తుంది వాటితోపాటు, వైన్, పండ్ల వైన్, కాగ్నాక్, వోడ్కా, షాంపైన్ లను ఫ్రెంచ్ టెక్నాలజీ ఆధారంగా తయారుచేస్తారు.

ఫ్యాక్టరీలో వివిధ రకాల ఎరుపు పొడి, సెమీస్వీట్, డిస్సర్ట్, పాతకాలపు వైన్ సహా క్రింది బ్రాండ్లు: హాయ్క్ నహపేట్, రెన్నైసెన్స్, అన్నా, లిలిట్, ఫ్రాంస్, ఎర్థ్ బ్లడ్, వెడ్డింగ్, ఏరెని వాయ్క్ లను ఉత్పత్తి చేస్తారు.[4] ఫ్రూట్ వైన్ ను కూడా ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేస్తారు దానిలోని బ్రాండ్లు: వైట్ కిష్మిష్ (వైట్ ష్ట్రా వైన్), మికాడో (ప్లం డెస్సర్ట్ వైన్), విన్ డి ఫరిస్ (రెడ్ సెమీస్వీట్ స్ట్రాబెర్రీ వైన్), విన్ డీ కాసిస్ నాయిర్ (రెడ్ సెమీస్వీట్ బ్లాక్ కరంట్ వైన్), విన్ డి ఫ్రాంబొయిస్ (రెడ్ సెమీస్వీట్ రాస్ప్బెర్రీ వైన్), బ్లాక్ కిష్మిష్ (రెడ్ సెమీస్వీట్ ష్ట్రా వైన్), విన్ డీ విడో (రెడ్ సెమీస్వీట్ చెర్రీ వైన్), విన్ డీ మూఋ (రెడ్ సెమీస్వీట్ బ్లాక్బెర్రీ వైన్), వెన్ డీ గ్రెనేడ్ (రెడ్ సెమీస్వీట్ పోమోగ్రానెట్ వైన్).[5]

కర్మాగారంలో ఉత్పత్తి చేసే కాగ్నాక్ బ్రాండ్లు: ప్రైడ్ ఆఫ్ ఆర్మేనియా (3, 5, 7 సంవత్సరముల నుండి), వాస్కే దార్, ఫ్రాంస్, నారె , ట్రిడాట్.[6]

ఫ్యాక్టరీలో వోడ్కా బ్రాండ్సు ముజిక్, రుస్సయ్యా నకోడ్కా.[7]

ఫ్యాక్టరీలో అనేక రకాల షాంపైన్ (స్పార్క్లింగ్ వైన్)  తయారవుతుంది, వాటిలో సెమీ డ్రై షాంపైన్, రెడ్ స్పార్క్లింగ్ షాంపైన్, డ్రై షాంపైన్, సెమీస్వీట్ షాంపైన్లు ముఖ్యమైనవి, అన్ని ఉత్పత్తులను ఆర్మేనియన్ షాంపైన్ బ్రాండ్ పేరిట తయారు చేస్తున్నారు.[8]

సూచనలు[మార్చు]

  1. "Երևանի Շամպայն Գինիների Գործարան - About Yerevan Champagne Wines Factory". armchampagne.am. Archived from the original on 2016-11-16. Retrieved 2016-11-23.
  2. "Armenian Oligarches Active in France - Hetq - News, Articles, Investigations". hetq.am. Archived from the original on 2016-11-23. Retrieved 2016-11-23.
  3. "Yerevan Champagne Wines Factory OJSC at spyur.am". spyur.am. Archived from the original on 2016-11-23. Retrieved 2016-11-23.
  4. "Երևանի Շամպայն Գինիների Գործարան - Wine products". armchampagne.am. Archived from the original on 2016-08-19. Retrieved 2016-11-23.
  5. "Երևանի Շամպայն Գինիների Գործարան - Fruit wine products". armchampagne.am. Archived from the original on 2016-08-19. Retrieved 2016-11-23.
  6. "Երևանի Շամպայն Գինիների Գործարան - Cognac products". armchampagne.am. Retrieved 2016-11-23.
  7. "Երևանի Շամպայն Գինիների Գործարան - Vodka products". armchampagne.am. Retrieved 2016-11-23.
  8. "Երևանի Շամպայն Գինիների Գործարան - Champagne products". armchampagne.am. Retrieved 2016-11-23.