రక్తంలో చక్కెర పరిమాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్లడ్ సుగర్ పరికరంతో పరీక్షించుట

బ్లడ్ షుగర్ లేదా రక్త చక్కెర అనగా మానవులు లేదా జంతువుల రక్తంలో ప్రస్తుతం ఉండే గ్లూకోజ్ పరిమాణం. ఇది శరీర కణాలు, రక్త లిపిడ్స్‌కు శక్తి కొరకు ఉన్న ప్రాథమిక వనరు. తక్కువ బ్లడ్ షుగర్ అంటే హైపోగ్లేసిమియా (రక్తంలో గ్లూకోజ్ మాంద్యత). హై బ్లడ్ షుగర్ అంటే హైపర్గ్లైసీమియా (రక్తంలో గ్లూకోజ్ అధికం). అధిక రక్త చక్కెర కలిగిన వారు డయాబెటిస్ మెల్లిటస్ (చక్కెర వ్యాధి) తో ఉంటారు. డయాబెటిస్ వున్న వారు బ్లడ్ సుగర్ లెవెల్స్ రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం చాలా అవసరం. భోజనం చేసినతరువాత పొద్దున్న బ్లడ్ సుగర్ చెక్ చేసుకునే టప్పటకి మధ్య టైమ్ 8 గంటల సమయం మాత్రం ఉండాలి. కరెక్టుగా 8 గంటల ఫాస్టింగ్ తరువాత తీసుకున్న రీడింగ్ 110 కంటే ఎక్కువ వున్నట్లైతే బ్లడ్ లో సుగర్ పరిమాణం ఎక్కువున్నట్లు నిర్ధారించుకోవాలి. అలాగే మరో బ్లడ్ సుగర్ ను చెక్ చేసుకోవాల్సిన మరో సమయం Post-Prandial ఆహారం తీసుకున్నతరువాత కరెక్ట్ గా రెండు గంటల సమయం తరువాత మాత్రమే ఈ రీడింగ్ తీసుకోవాలి. ఈ రీడింగ్ 140 కంటే ఎక్కువున్నట్లైతే సుగర్ లెవెల్స్ ఎక్కువైనట్లు నిర్ధారణ చేసుకోవచ్చు. నూతనంగా కనుగొన్న విధానం ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న విధానం (ఎ1సి)లో ఉన్న లోపాలు సగానికి పైగా తగ్గి మరింత కచ్చితంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సుగర్‌ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. వ్యాధిగ్రస్తుల్లో ఎర్రరక్త కణాల వయసును అంచనా వేయడం ద్వారా మూడు నెలల సరాసరి సుగర్ ఎంత ఉందో మరింత మెరుగ్గా అంచనా వేయవచ్చు.[1]

హెచ్‌బిఏ1సి (హిమోగ్లోబిన్‌ ఏ 1సి)[మార్చు]

గడచిన 3 నెలల కాలంలో సగటు చక్కెర స్థాయులను (బ్లడ్‌ సుగర్‌ లెవెల్స్‌) తెలుసుకోవడానికి చేసే రక్తపరీక్ష. హెచ్‌బిఏ1సి 6.5% అంతకన్నా ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్టుగా పరిగణించి చికిత్స ప్రారంభిస్తారు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "బ్లడ్‌ షుగర్‌ ఎంతుండాలి?". 2018-02-05. Archived from the original on 2018-04-26. Retrieved 2018-05-02.