రాంబో
| ర్యాంబో: ఫస్ట్ బ్లడ్ | |
|---|---|
Theatrical release poster by Drew Struzan |
|
| దర్శకత్వము | టెడ్ కొట్చెఫ్ |
| నిర్మాత | Buzz Feitshans Mario Kassar Andrew G. Vajna |
| Screenplay by | Michael Kozoll William Sackheim Sylvester Stallone |
| Based on | ఫస్ట్ బ్లడ్ నవల by డేవిడ్ మోరెల్ |
| తారాగణం | సిల్వెస్టర్ స్టాలోన్ రిచర్డ్ క్రెన్నా బ్రియన్ డెన్నె |
| సంగీతం | జెర్రి గోల్డ్ స్మిత్ |
| సినిమెటోగ్రఫీ | ఆండ్రూ లాస్జ్లో |
| కూర్పు | Joan E. Chapman |
| Studio | అనాబేసిస్ ఇన్వెస్ట్మెంట్స్ N.V. |
| డిస్ట్రిబ్యూటరు | ఓరియన్ పిక్చర్స్ |
| విడుదలైన తేదీలు | అక్టోబర్ 22, 1982 |
| నిడివి | 97 నిమిషాలు |
| దేశము | మూస:యూఎస్ చలనచిత్రం |
| భాష | ఆంగ్లము |
| బడ్జెట్ | $14 మిలియన్ |
| Gross revenue | $125,212,904 |
1982లో సిల్వెస్టర్ స్టాలోన్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" విడుదలయ్యింది. జాన్ రాంబో గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. అది పూర్తయిన తరువాత అతనికి సరైన గుర్తింపు లభించలేదు. స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని విధవ ఐన అతని భార్య ద్వారా తెలుసుకుంటాడు. చిత్రం ప్రారంభంలో రాంబో(స్టాలోన్) చిన్న పట్నం పొలిమేరల్లో బ్రిడ్జ్ పై నడిచి వస్తుంటాడు. అతన్ని చూసిన పట్టణ షరీఫ్ వివరాలడుగుతాడు. అతడు చెప్పిన ప్రదేశానికి తను తీసుకువెలతానని చెప్పి తన పోలీసు కారులో పొలిమేరలో దింపుతాడు నిజానికి రాంబో సిటీకి వెళ్లాలనుకుంటాడు అందువలన పోలీసు అధికారి దించిన ప్రదేశం నుండి తిరిగి వెనక్కి రావడం అధికారి గుర్తిస్తాడు అందువలన అతడు మరల వెనక్కి వచ్చి అతన్ని సోదా చేసి కత్తిని కనుగొంటాడు. అది ఎందుకు అని అడిగితే రాంబో వేట కోసం అని చెబుతాడు. షరీఫ్ అతనిని పోలీసు స్టేషనుకు తీసుకెళతాడు. అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు. రేజరుతో అతన్ని సమీపిస్తున్న పోలీసుని చూసి గతంలో వియత్నాం యుద్ధంలో సంఘటనల్ని గుర్తుచేసుకుని తిరగబడతాడు. అతడు పోలీసు స్టేషన్ నుండి తప్పించుకుని బైకుపై పారిపోయే క్రమంలో పోలీసు అధికారి చేదనలో సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తరువాత అతడు అడవిలోకి పారిపోయి గుహలో తలదాచుకుంటాడు. అతడిపై కోపోద్రిక్తుడైన పోలీసు అధికారి ఎలాగైనా పట్టి తీరాలనుకుని పోలీసు బలగాలను ఉపయోగిస్తాడు. చివరకు ఆర్మీ సహాయం కూడా తీసుకుంటాడు కానీ రాంబో తన యుద్ద నైపుణ్యాన్ని కనపరచి ఎదురుదాడి చేసి తప్పించుకుంటాడు. చివరకు పోలీసు అధికారిని చంపివేయాలనుకుంటాడు, పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి అధికారిపై తూటా ఎక్కుపెడతాడు కానీ తన సైనిక శిక్షకుడు(గురువు) జోక్యంతో లొంగిపోతాడు.