రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామదాసు
(1933 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
నెల్లూరి నాగరాజారావు,
రామతిలకం
నిర్మాణ సంస్థ ఈస్టిండియా ఫిలిమ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రామదాసు 1933లో విడుదలైన తెలుగు టాకీ సినిమా.[1] ఇది కలకత్తాలోని ఈస్టు ఇండియా ఫిలిం కంపెనీ వారిచే తయారుచేయబడింది. శ్రీమాన్ బళ్ళారి, ధర్మవరం గోపాలాచార్యులు రచించిన రామదాసు నాటకము నుండి చలనచిత్రమునకు తగినట్లుగా మార్చబడింది. దీనికి అక్తర్ నవాజ్ డైరెక్టరు, కృష్ణగోపాల్ ఫోటోగ్రాఫర్, ఆర్. సి. విల్‌మన్, సి. యన్. నిగం శబ్దగ్రాహకులు.

1933లో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ వారు అఖ్తర్‌ నవాజ్‌ దర్శకత్వంలో ‘రామదాసు’ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. అప్పట్లో బళ్ళారి రాఘవ, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ నాటకాన్ని ప్రదర్శిస్తూ వుండేవారు. అదే నాటక స్క్రిప్టుని సినిమాగా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అందులో కబీరుగా నటించేందుకు బలరామయ్య అన్న రాధాకృష్ణయ్యకు, రాముడుగా నటించేందుకు మరో అన్న శేషాచలంకు ఆహ్వానాలు అందాయి.[2]

నటీనటులు[మార్చు]

పాత్రలు నటీ నటులు
రామదాసు ఆరణి సత్యనారాయణ
కబీరు ఘంటసాల రాధాకృష్ణయ్య
తానీషా నెల్లూరు నాగరాజరావు
ధర్మకర్త కె. శ్రీనివాసాచారి
అహమక్ వెంకటసుబ్బయ్య
రాముడు ఘంటసాల శేషయ్య
లక్ష్మణుడు యం. యస్. రంగరావు
కమలాంబ సరస్వతి
సితారా బేగం రాంపాప

కీర్తనలు[మార్చు]

క్రమ సంఖ్య కీర్తన ఆలపించినవారు
1 శ్రీరమణ మృదుచరణ కమలాంబ
2 దానవమర్దన, దశరథనందన బ్రాహ్మణులు
3 భద్రాద్రి రఘురామ భజనకు జనుచుండ రామదాసు
4 రఘురామ రఘురామ పరాత్పర అందరు
5 స్వామిసేవ సేయబోదము రెడ్లు
6 ఏడుకొండలవాడ వెంకటరమణ దాసరి
7 కహో ఖాతిర్ సే హరదం కబీరు
8 అఖల్ తేరి హుఈ గుంగురుయా కబీరు
9 మై గులాం మై గులాం కబీరు
10 దర్‌షన్ దేవ్ రామా తేరాసాథ హై హం కబీరు
11 యాద కరో అల్లా అల్లా యాద కరో తుమే కబీరు
12 ఏ మహనీయ తేజుడు కబీరు
13 రాముడె తండ్రి నాజనని రాముడె రామదాసు
14 చోరులు గోరని నిధియై
15 ఏడ నున్నాడో భద్రాద్రివాసు డేడనున్నాడో రామదాసు
16 జో తుహి జో సమాయియే కబీరు
17 వహ్వాయి సారాయి - వడుపైన సారాయి జల్సాసీను
18 ---లే దొక గవ్వనాకు నిధి రామదాసు
19 యమపాశంబును ఖండ ఖండములుగా రామదాసు
20 శ్రీకృష్ణు డను పేరు చెన్నార ధరణిపై రామదాసు
21 ఏ తీరున నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా రామదాసు
22 రామరామజే రాజారాం రామరామజే సీతారామ్ రామదాసు
23 పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద ప్రార్థన
24 ఇక్ష్వాకుకులతిలక యికనైన బలుకవె రామచంద్రా రామదాసు

మూలాలు[మార్చు]

  1. రామదాసు, తెలుగు టాకీ, తొలినాటి సినిమా పాటల పుస్తకములు, మొదటి సంపుటి, సంకలనం: హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్, నాగర్ కర్నూల్, పేజీ. 37.
  2. "'ప్రతిభా'ధిపతి ... బలరామయ్య". సితార. Archived from the original on 2019-11-10. Retrieved 2020-08-23.

ఇతర లింకులు[మార్చు]