రాళ్ళ పల్లి అచ్యుతరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాళ్ళపల్లి అత్యుతరామయ్య (ఆగస్టు 10, 1910 - డిసెంబరు 18, 1963)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ శాసన సభ్యులు. ఆయన 1962 జనరల్ అసెంబ్లీ ఎన్నికలలో బందరు(మచిలిపట్నం) శాసన సభ స్థానం నుండి శాసన సభ్యునిగా భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[2] [3]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కృష్ణా జిల్లా కు చెందిన మచిలీపట్నంలో రాళ్ళపల్లి వెంకటరామయ్య, సత్యనారాయణమ్మ దంపతులకు 1910 ఆగస్టు 10 న జన్మించారు. ఆయన చిన్నవయస్సులో తండ్రి మరణించినందువల్ల వారి మామయ్య రాళ్ళపల్లి రంగయ్య గారి వద్ద పెరిగారు. ఆయన 1935 లో విశాఖపట్నం లోని ఆంధ్రా మెడికల్ కళాశాల లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. ఆయన ప్రసిద్ధ వైద్యునిగా ఖ్యాతి పొందారు. అహర్నిశలు పేదలకొరకు తన సేవలనందించారు. ఆయన ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ లో క్రియాశీల సభ్యునిగా ఉన్నారు. వైద్య వృత్తికి సంబంధించి ఆయన అంకిత భావంతో అందించిన సేవలు మచిలీపట్నం చుట్టుపక్కల ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు ఆయన చేసిన కృషి ఆయన గ్రామీణ పేద ప్రజల మనసులలో ప్రత్యేక స్థానం పొందేలా చేసింది.

ఆయన భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధేయవాదిగా సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1947 నుండి 1952 మధ్య కాలంలో మచిలీపట్నం మ్యునిసిపల్ చైర్మన్ గా తన సేవలనందించారు. ఆయన ప్రతిఫలాక్ష లేకుండా ప్రజలకు చేసిన సేవలు ప్రసిద్ధమైనవి. ఆయన కాలంలో మచిలీపట్నం లో "డా. పట్టాభిసీతారామయ్య మ్యునిసిపల్ కాంప్లెక్స్" నిర్మితమైనది. అనేక గ్రంథాలయాలను నెలకొల్పాడు.

మూలాలు[మార్చు]

  1. "Records Available For Achyutha Ramaiah Rallapalli - MyHeritage". www.myheritage.com. Retrieved 2018-01-17.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1962". www.elections.in. Archived from the original on 2018-04-14. Retrieved 2018-01-17.
  3. "Bandar Vidhan sabha assembly election results in Andhra Pradesh". elections.traceall.in (in ఇంగ్లీష్). Retrieved 2018-01-17.