రిథమ్‌బాక్స్
| రిథమ్‌బాక్స్ | |
|---|---|
రిథమ్‌బాక్స్ 2.90.1 యొక్క తెరపట్టు |
|
| అభివృద్ధిచేసినవారు | గ్నోమ్ జట్టు |
| మొదటి విడుదల | ఆగష్టు 18, 2001 |
| సరికొత్త విడుదల | 2.95 / జనవరి 15, 2012 |
| ప్రోగ్రామింగ్ భాష | సీ |
| నిర్వహణ వ్యవస్థ | లినక్స్, సొలారిస్, BSD మరియు ఇతర యునిక్స్-వంటి |
| భాషల లభ్యత | బహుళభాషలు |
| రకము | ఆడియో ప్లేయర్ |
| లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
| వెబ్‌సైట్ | రిథమ్‌బాక్స్ వెబ్ సైటు |
రిథమ్‌బాక్స్ అనేది డిజిటల్ సంగీతాన్ని ఆడించుటకు రూపొందించబడిన ఒక సంగీత ప్లేయర్. నిజానికి ఆపిల్ ఐట్యూన్స్ నుండి ప్రేరణ పొంది తయారుచేయబడింది. ఇది ఒక ఫ్రీ సాఫ్టువేర్, గ్నోమ్ డెస్కుటాప్ కొరకు జిస్ట్రీమర్ మీడియా ఫ్రేమ్ వర్కుని వాడుకుని పనిచేసేలా రూపొందించబడింది.
విషయ సూచిక |
[మార్చు] విశిష్టతలు
రిథమ్‌బాక్స్ చాలా విశిష్టతలను కలిగివుంది. వాటిలో కొన్ని
[మార్చు] మ్యూజిక్ ప్లేబ్యాక్
వివిధ రకాల డిజిటల్ సంగీతానికి ప్లేబ్యాక్ మద్ధతు ఉన్నది. కంప్యూటరు నందు ఫైళ్ళు స్థానికంగా ఉండటం వలన సాధారణంగా ప్లేబ్యాక్ అందిస్తుంది. అంతర్జాల రేడియో మరియు పాడ్ కాస్టులకు కూడా రిథమ్‌బాక్స్ మద్ధతుస్తున్నది.
[మార్చు] సంగీతాన్ని దిగుమతిచేయుట
ఆడియో సీడీ రిప్పింగు (ఇందుకొరకు సౌండ్ జ్యూసర్ ప్యాకేజీ అదనంగా కావాలి) ఐపాడ్ మద్ధతు
[మార్చు] ఆడియో సీడీ బర్నింగు
0.9 విడుదల నుండి, రిథమ్‌బాక్స్ నందలి పాటలజాబితా ద్వారా ఆడియో సీడీలను సృష్టించవచ్చు.
[మార్చు] ఆల్బమ్ కవర్ ప్రదర్శన
0.9.5 విడుదల నుండి, ప్రస్తుతం ప్రదర్శించబడుతున్న పాట యొక్క ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తున్నది.
[మార్చు] పాటల లిరిక్స్ ప్రదర్శన
0.9.5 విడుదల నుండి, ప్రస్తుతం ప్రదర్శించబడుతున్న పాట యొక్క లిరిక్సును కూడా ప్రదర్శిస్తున్నది.
[మార్చు] లాస్ట్.ఎఫ్ఎం మద్ధతు
0.9.6 విడుదల నుండి, పాటల సమాచారాన్ని ఖాతా ద్వారా లాస్ట్ ఎఫ్ఎంకు నివేదించగలదు.
[మార్చు] DAAP భాగస్వామ్యం
0.10 రూపాంతరంలో DAAP భాగస్వామ్యం కూడా మద్ధతు చేర్చబడింది.