వాడుకరి:Pravallika.bh/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసరచన పోటీ కొరకు

ప్లాస్మాత్వచం [plasma membrane][మార్చు]

జంతు కణంలోని కణపదార్దాన్ని సైటోప్లాసం అనీ, దాన్ని ఆవరించి వున్న త్వచాన్ని కణత్వచం లేదా ప్లాస్మాత్వచం అని పిలుస్తారు.

  • కణం ఒక జీవ ప్రమాణంగా, జీవ ప్రమాణం ఒక కణంగా భావించడమే కణానికి ఉన్న ప్రత్యేకత .
  • కనిష్ట జీవ పదార్ద రాశి లో తగిన జీవక్రియలు ఉండటమే ఈ ప్రత్యేకత.
  • కణాంతర్భాగం లోని పరిస్థితులు కణబహిర్భాగాన ఉన్న పరిస్థితులకు విబిన్నంగా, జీవ క్రియలు జరగడానికి అనుకూలంగా ఉండడానికి కారణం ప్లాస్మాత్వచం అనే కణాంగమే.
  • జంతు కణాలన్నింటిలో సాగే గుణం కలిగి వరణాత్మక పారగమ్యత కలిగిన పొరతో ఆవరించి ఉంటుంది.
  • 1885 సం.లో సి..క్రామర్, నగేలి అనే శాస్త్రవేతలు ఈ త్వచన్ని కణత్వచం అని పేర్కొన్నారు.
  • 1931 లో J.Q. ప్లవర్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్లాస్మాలెమ్మా గా నామకరణం చేశాడు
  • డి.రాబర్ట్ సన్ అనే శాస్త్రవేత్త ఈ కణత్వచన్ని ప్లాస్మాత్వచం గా వర్ణించాడు.ప్రస్తుతం ఈ పేరే వాడుకలో ఉంది.
  • ప్లాస్మత్వచం నిర్మాణం దాదాపు 1959 లో రాబర్ట్ సన్ పరికల్పన చేసిన ప్రమాణ త్వచన్ని పోలి ఉంటుంది.
  • ఈ విదంగా 35A ప్రమాణాల మందంలో ఉన్న మధ్య పొర రెండు ఫాస్పోలిపిడ్ పొరల తో ఏర్పడి ఉంటుందని, దానికిరువైపులా 20A ప్రమాణాల మందంతో రెండు ప్రోటీను పొరలు ఉండి మొత్తం 75A ప్రమాణాల మందం ఉన్న ఈ లైపో ప్రోటీన్ త్వచన్ని ప్రమాణ త్వచం అంటారు.

రసాయనిక నిర్మాణం[మార్చు]

  • ప్లాస్మ త్వచం కొవ్వు పదార్దాలు, ప్రోటీన్లు, కొన్ని ఆలిగో సాకరైడ్లు, నీరు మొదలైన పదార్దాలతో ఏర్పడి ఉంటుంది.
  • ముఖ్యంగా ఇది లిపిడ్లు, ప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది.
  • కాబట్టి దీన్ని లైపోప్రోటీన్ త్వచం అని అంటారు.

లిపిడ్లు

  • లిపిడ్లు ముఖ్యంగా ఫాస్ఫోలిపిడ్లు, కొలెస్టిరాల్ రూపంలో ఉంటాయి ఫ్పాస్పోలిపిడ్లు రెండు రకాలు 1. న్యూట్రల్ ఫాస్పోలిపిడ్లు

2. ఆసిడ్ ఫాస్ఫోలిపిడ్లు

  • 1. న్యూట్రల్ ఫాస్పోలిపిడ్లు;- వీటికి విద్యుదావేశం లేదు. ప్లాస్మాత్వచంలో ఇవి యుగళ త్వచంగా దగ్గరగా బంధించబడి ఉంటాయి. ఉదా; ఫాస్ఫాటిడిల్ కోలిన్
  • 2.ఆసిడ్ ఫాస్ఫోలిపిడ్లు;- ఇవి ఋణ విద్యుత్ ఆవేశాన్ని కలిగిన ప్రోటీన్లతో కలిసి ఉంటాయి. ఉదా; ఫాస్ఫాటిడిల్ ఐనోసిటాల్
  • ==ప్రోటీన్లు==
  • ప్లాస్మాత్వచంలో రెండు రకాలైన ప్రోటీన్లు ఉంటాయి. అవి
  1. నిర్మాణాత్మక ప్రోటీన్లు
  2. క్రియాత్మక ప్రోటీన్లు

నిర్మాణాత్మక ప్రోటీన్లు;- నిర్మాణాత్మక ప్రోటీన్లు త్వచానికి యాంత్రిక శక్తి ఇవ్వడం లో తోడ్పడతాయి. ఈ నిర్మాణాలు ప్లాస్మా పొరకు వెన్నెముక వంటిది. ఇవి రెండు రకాలు

  1. పరిదీయ ప్రోటీన్లు
  2. అంతర్గత ప్రోటీన్లు

ఉదా; ఎర్ర రక్త కణాలో స్పెక్ట్రిన్

క్రియాత్మక ప్రోటీన్లు;-ప్లాస్మాతవచంలో ఉండే క్రియాత్మక ప్రోటీన్లు అనేక క్రియలను నిర్వర్తిస్తాయి. ప్లాస్మాత్వచం నుంచి దాదాపు 30 రకాల ఎంజైం లను వేరు పరచారు. వాటిలో కొన్ని ఆల్కలైన్ ఫాస్పటేజ్ RNA ఉదా; ATP-ase,

 ప్లాస్మాత్వచ నిర్మాణం;-

దీని నిర్మాణాన్ని సూచించే అనేక సిద్దాంతాలు ద్వీస్తర సిద్దాంతం; డేవ్ సన్, డానియెల్లీ, అనే శాస్త్రవేత్తలు 1952 లో ప్రతిపాదించారు

  • దీని ప్రకారం రెండు వరసలలో ఉన్న ఫాస్ఫోలైపిడ్ అణువులు రెండు ప్రోటీన్ పొరల మద్యన అమరి వుంటాయి.
  • జల సఖ్య గుణం గల ద్రువశిరో భాగాలు వెలుపల వైపునకు అమరి ఉండి ప్రోటీన్ అణువులలో హైడ్రోజన్ బందాల ద్వారా కలపబడి ఉంటుంది.

త్రిస్తర సిద్దాంతం; దీన్ని జె.డేవిడ్ రోబర్ట్ సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు.

  • దీని ప్రకారంప్లాస్మాత్వచం మందం దాదాపు 75A లు ఉంటుంది
  • అందులో మద్య వున్నకొవ్వు 35A లు దానికి ఇరువైపులా 20A ప్రమాణాల మందం ఉన్న రెండు ప్రోటీన్ పొరలు ఉంటాయి.

మైసిల్లార్ నమూనా; హిల్లియర్, హాఫ్ మన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

  • 1953లో ప్లాస్మ త్వచం పటలికా రహితమైన అమరికలో ఉంటుందని వర్ణించారు.
  • ఈ సిద్దాంతం ప్రకారమం పాస్పోలిపిడ్లు లోపలి వైపున గోళాకారంలో ఉన్న మైసెల్లై అనే ఉపభాగాలుగా ఏర్పడి ఉంటాయి.
  • ఈ మైసెల్లై ప్లాస్మాత్వచంలో భాగాలు గా అమరి ఉంటాయి.
  • ఒక్కో మైసెల్లై లో 6-8 ఫాస్పోలిపిడ్ అణువులు అమరి ఉంటాయి.

ద్రవరూప మొజాయిక్ నమూనా; సింగర్-నికోల్సన్ 1972 లో ప్రతిపాదించాడు.

  • దీన్ని శాస్త్రవేత్తలు అందరూ ఆమోదించారు
  • వీరి పరికల్పన ప్రకారం1. లిపిడ్లు,ప్రోటీన్లు మొజాయిక్ విధానంలో అమరి ఉంటాయి.

2.జీవ సంబంధ త్వచాలన్ని అసమగ్ర ద్రవ రూప నిర్మాణాలు. అందులో లిపిడ్, ప్రోటీన్ భాగాలు ద్విస్తరిత లిపిడ్ పొరలో స్థానాంతర చలనం చేయగలిగే స్థితి లో ఉంటాయి.

===ప్లాస్మాత్వచం విధులు===

ప్లాస్మాత్వచం ద్వారా వివిధ పద్దతులలో రవాణా చెందుతుంది.1. ఆస్మాసిస్ 2.నిష్క్రియా రవాణా 3. సక్రియా రవాణా 4. ఎండోసైటోసిస్ 5. ఎక్సోసైటాసిస్ ఆస్మాసిస్; దీనిని ద్రవాభిసరణ అని కూడా అంటారు.

  • నీరు మొదలయిన ద్రవ పదార్ధాలు ప్లాస్మాత్వచం ద్వారా తక్కువ గాడత నుండి అధిక గాడ ద్రావణం లోకి రెండు ద్రావణాల గాడత సమానం అయ్యె వరకు ప్రవహిస్తాయి.
  • ఈ ప్రక్రియను ఆస్మాసిస్ అని అంటారు.

.నిష్క్రియా రవాణా ; దీనిని వ్యాపనం అని కూడా అంటారు.

  • వివిధ పధార్దాల యొక్క అయాన్లు, అణువులు అధిక గాడత నుండి తక్కువ గాడత గల ప్రదేశాలకు ప్రయాణిస్తుంది.
  • ఈ ప్రక్రియను వ్యాపనం అని అంటారు

సక్రియా రవాణా;విద్యుత్ రసాయనిక ప్రవణత గాడతకు వ్యతిరేకంగా ప్లాస్మాత్వచం ద్వారా వివిధ పదార్దాల రవాణాను సక్రియా రవాణా అంటారు. ఈ పద్దతి లో వివిధ పదార్ధాలు అల్ప గాడతల నుంచి అధిక గాడత గల ప్రదేశాలకు వెలుతుంది. ఉధా; .చిన్న పేగు కుడ్యంలో గల ఉపకళాకణాలలో గ్లూకోజు అమైనో ఆమ్లాల గాఢత చిన్న పేగు కుహరం లో కంటే కొన్ని వందల రెట్లు అధికంగా ఉన్నప్పటికి కుహురం నుంచి కణాలలోకి ఈ పధార్దాల రవాణా సక్రియా రవాణా పద్దతి లో జరుగుతుంది. ఎండోసైటోసిస్; ఈ పద్దతి లో ప్లాస్మాత్వచం పదార్దలను వాటి చుటూ ఆశయాల నేర్పరచి జాంతవ భక్షన పద్దతి లో కణంలోకి గ్రహిస్తుంది. దీన్ని అంతర గ్రహణం అంటారు. ఇవి 2 రకాలు1. కణపాణం 2. కణ భక్షణ