వాడుకరి:Purushotham9966/మండలిలో మాస్టారు, విఠపు బాలసుబ్రహ్మణ్యం ఎంపిక చేసిన ప్రయోగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాలుగు వందల పుటల గ్రంథంలో 16 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎంఎల్.సిగా విఠపు బాలసుబ్రహ్మణ్యం చేసిన ఉపన్యాసాలు. విఠపు బాలసుబ్రహ్మణ్యం మాస్టారు జీవితం ప్రజలకు అంకిమై సార్ధకంగా సాగిపోయిన కథ బోధపడుతుంది. కొందరికి ఎంఎల్.సి పదవి ఒక భూషణం, విఠపు గారికి కర్తవ్య నిర్వహణకు సాధనం. అధ్యాపకుల ప్రతినిధిగా ఎంపికైనా, సమాజంలోని అన్ని వర్గాల సమస్యలను కౌన్సిల్.లో ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. యానాదులు, చెంచులు వంటి నోరులేని ఆదివాసీల సమస్యలనుంచి సమాజంలో ప్రాతినిధ్యం లేని, ప్రతిఒక్కరి సమస్యను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. విఠపు బాలసుబ్రహ్మణ్యం గారిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం, మామండూరు గ్రామం. ఆయన చిత్తూరు జిల్లా శ్రీ వ్యాసాశ్రమం పాఠశాలలో చదివి, నెల్లూరు జిల్లా విద్యానగర్, కడపజిల్లా శ్రీ వేంకటేశ్వర విద్యాలయం నుంచి ఎం.ఏ., రాష్ట్ర భాషా ప్రవీణ డిగ్రీలు పొంది, మూడున్నర దశాబ్దాలపాటు తెలుగు అధ్యాపకులుగా చేశారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, జనవిజ్ఞాన వేదికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. అక్షరాస్యతా, సారా వ్యతిరేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని, వాటికసరమైన పాఠ్య గ్రంథాలు, శిక్షణా సామగ్రిని రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. “చదువు -వెలుగు”, ‘చదువు’ పత్రికల సంపాదకులుగా వ్యవహరించారు. విద్యా, సాంస్కృతిక సామాజికాంశాలపై పలు గ్రంథాలు రచించారు, పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. గత 47ఏళ్ళుగా వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. 2007లో శాసనమండలి పునరుద్ధరించబడిన తర్వాత పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికై 2011-2017నడుమ మొత్తం మూడు పర్యాయాలు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికై 16 సంవత్సరాలు శాసనమండలి సభ్యులుగా పిడిఎఫ్ ఫ్రంట్ నాయకులుగా, ప్రొటెం స్పీకర్.గా, ప్రొటెం ఛైర్మన్ గా పలు బాధ్యతలు విజయవంతంగా నిర్వహించిన అలుపెరుగని ప్రజా సేవకులు, ప్రజా ప్రతినిధులు విఠపు బాలసుబ్రహ్మణ్యం గారు. శాసనమండలి సభ్యులుగా ఆయన నిబద్ధత, ప్రజలపట్ల ప్రేమ ఈ పుస్తకంలోని ప్రతి వాక్యంలో తెలుస్తోంది. మూలాలు: "మండలిలో మాస్టారు, విఠపు బాలసుబ్రహ్మణ్యం ఎంపికచేసిన శాసనమండలి ప్రసంగాలు", ప్రచురణకర్త: డాక్టర్ దార్ల బుజ్జిబాబు, నెల్లూరు, 2024.