వాడుకరి:Sai priyanka27

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు ప్రియాంక.నేను కాకరపర్తి భావనారయన కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. వ్యాసరచన పోటీ కొరకు వ్యాసం

యండమూరి వీరేంధ్రనాథ్[మార్చు]

యండమూరి వీరేంద్రనాథ్ ఒక ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత. అతను తన సాంఘికాత్మకమైన రచనలతో యువ తరాలను ప్రభావితం చేశాడు. తన రచనలలో అతను పేదరికం వంటి భారతదేశం లో ముఖ్యమైన సామాజిక సమస్యలు పలుపక్షపాతాలు మరియు మూఢనమ్మకాలను మరియు సామాజిక బాధ్యత ఉండాలి అని ప్రోత్సహిస్తూ రచనలు చేశారు.

యండమూరి వీరేంధ్రనాథ్
యండమూరి వీరేంధ్రనాథ్

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

యందమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972 లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.

వివాహం[మార్చు]

ఆయనకు 10-03-1974 లో అనుగీత తో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్.

సినీ.రంగం[మార్చు]

యండమూరి రచనల్లో చాలా రచనలు చలన చిత్రాలుగా రూపొందాయి.వీరి రచనల్లో అభిలాష,డబ్బు డబ్బు ,తులసి(కాష్మోర) మొదలగునవి చిత్రాలుగా రూపొందాయి.కేవలం సినిమాల కోసమే విక్కీదాద అనే రచన చేశారు.

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]