వాడుకరి:V Bhavya/ప్రయోగశాల 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఛందస్సు[మార్చు]

పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని "ఛందస్సు "అంటారు.

ఛందస్సు అనే పదము "ఛదీ ఆహ్లాదనే"  అనే పదము నుండి ఉద్భవించింది. దీని యొక్క అర్థం "ఆహ్లాదకరమైన లయ".

ఛందస్సుకు  మరియొక పేరు  “పద్య విద్య “.

పద్యాన్ని నిర్మించాలంటే గణాలు తెలియాలి.

గణాలు తెలియాలంటే గురువు, లఘువులు తెలియాలి.

లఘువు

ఏక  మాత్ర కాలంలో  ఉచ్చరింపబడేవి  "లఘువులు".

దీనిని నిలువు గీత” |  “ చేత సూచిస్తారు.

తెలుగులో లఘువు ని” ల” చేత సూచిస్తారు.

మాత్ర అనగా సెకనులో నాలుగవ వంతు భాగము.

గురువు

రెండు మాత్రల కాలములో ఉచ్చరింపబడేవి  గురువులు.

దీనిని”U“ ఆకారంతో  సూచిస్తారు.

తెలుగులో గురువును” గ” చేత సూచిస్తారు.

గురువు లక్షణాలు:-[మార్చు]

1.  దీర్ఘాలు(అచ్చులు) వీటికి ఉదాహరణ:- ఆ, ఈ, ఊ,ౠ,.....

2.  దీర్ఘాలు( హల్లులు) వీటికి ఉదాహరణ:- కా, కీ, కూ,....

3.  పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు.  ఉదాహరణ:- కం, నం, మం,.....

        ఉదాహరణ:- ఆలయం

                             U  |    U

4.  విసర్గ తో కూడిన అక్షరాలు.

          ఉదాహరణ:- దుఃఖం

                                U    U

5.  పొల్లుతో కూడిన అక్షరాలు.

            ఉదాహరణ:- నిన్, నున్,కిన్,.....

            ఉదాహరణ :-మునుల్

                                   |   |    U

6.  సంయుక్త, ద్విత్వాక్షరాలకు ముందున్నవి.

      సంయుక్తాక్షరం:- ఒక హల్లుకు వేరొక హల్లు  ఒత్తుగా ఉన్నట్లయితే అది సంయుక్తాక్షరం అవుతుంది.  ఉదాహరణ:- మ్య ,ర్న,ప్స ,.....

      ద్విత్వాక్షరం:- ఒక హల్లుకు దానికి  అదే ఒత్తుగా ఉన్నట్లయితే అది ద్విత్వాక్షరం అవుతుంది.

  ఉదాహరణ:- మ్మ,య్య,ర్ర,స్స ,.....

  ఉదాహరణ :-అమ్మ,అన్నయ్య

                        U   |    U U |

7.ఐత్వము, ఔత్వము తో  కూడినవి.

   ఉదాహరణ:- మై, నై, కై, నౌ, కౌ,.....

   రామునికై

   U   |    |  U

లఘువు  లక్షణాలు:-[మార్చు]

1. దీర్ఘము  లేనిది, ప్రతి ఒక్కటి  లఘువు అవుతుంది.

2. హ్రస్వం ( అచ్చులు).

     ఉదాహరణ:-  అ,ఇ,ఉ,.....

3. వట్రసుడి కలిగిన అక్షరాలు.

      ఉదాహరణ:- కృ,మృ,నృ,.....

       ఉదాహరణ:- వి కృతము

                            |   |    |    |

       ఆమె పేరు స్రవంతి   ( గణ విభజన)

         U  |   U |    |   U  |

       రెండు  వేరు వేరు పదాల మధ్య సంయుక్త, ద్విత్వాక్షరాలు ఉన్నప్పటికీ దాని ముందున్న అక్షరం  లఘువు అవుతుంది.

గణాలు-రకాలు[మార్చు]

ద్వయాక్షర గణాలు :-ఇవి నాలుగు రకాలు.

1. వ గణం -| U   దీనికి మరి యొక పేరు లగం.

2. హ గణం -U |    దీనికి మరి యొక పేరు గలం.

3. లల గణం -| |    

4. గగ   గణం -U U

త్వయాక్షర గణాలు:- ఇవి ఎనిమిది.

భ -U | |    య -| U U    వ -| U

జ -| U |      ర -U | U     న -| | |

స -| | U      త -U U |    మ -U U U

చతురాక్షర  గణాలు:- ఇవి మూడు రకాలు.

నల-| | | |      న-  గణం మీద  లఘువు చేరుతుంది.

నగ- | | | U     న-  గణం మీద  గురువు  చేరుతుంది.

సల-| | U |     స-  గణం మీద  లఘువు చేరుతుంది.

ఉప గణాలు:-[మార్చు]

ఇందులో ఇంద్ర,  సూర్య  గణాలు ఉంటాయి.

ఇంద్ర గణాలు:- ఇవి ఆరు.

 నల-| | | |

 నగ -| | | U

 సల -| | U |

  భ   -U | |

  ర    -U | U

  త   -U U |

సూర్య గణాలు:- ఇవి రెండు.

  హ   -U |

  న    -| | |