వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 5
Jump to navigation
Jump to search
వికీపీడియాలో సంతకం చెయ్యడం ఎలా
వికీపీడియాలో సభ్యులు చర్చాపేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట. సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.
సభ్యనామం రాయడం
సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా రాయడం
తేదీ, సమయం మాత్రమే రాయడం
సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నం నొక్కితే సరిపోతుంది. అలా కాకుండా సాధారణ ఎడిటర్ లో మరిన్ని సౌలభ్యాలతో చేర్చటానికి "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను -
3 సార్లు నొక్కితే - సభ్యనామం
4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం
5 సార్లు నొక్కితే - తేదీ, సమయం
చూపబడతాయి.