వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 16, 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్వికీ లింకులు ఇవ్వడం

ఒక వ్యాసం రాస్తున్నప్పుడు ఒక లింకు తెలుగులో లేదనుకోండి, అయినా గాని ఒక ఇతర భాష లింకు చాలా ఉపయోగకరంగా అనిపిస్తే మీరు ఆ పదానికి అంతర్వికీ లింకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు [[:en:Wikipedia:Tip of the day|ఇంగ్లీష్ వికీలో చిట్కాలు]] అని రాస్తే ఇంగ్లీష్ వికీలో చిట్కాలు అని ప్రదర్శించబడి ఇంగ్లీషువికీలో చూపించన పేజీకి దారి తీస్తుంది. ఈ లింకు మామూలు లింకులవలె కాకుండా లేత నీలం రంగులో ప్రదర్శించబడడాన్ని మీరు గమనించే ఉంటారు. అదే విధంగా ఇతర భాషలకు కూడా లింకులు ఇవ్వవచ్చు. కానీ తెలుగు భాషలో ఉన్న వ్యాసాలకు గాని, తర్వాత తప్పకుండా తయారవుతాయనిపించే లింకులు ఇవ్వకండి. తెలుగులో ఆ వ్యాసం రాబోదని మీరు నమ్మి, అది ఆ భాషలింకుగా ఉంటేనే ప్రాముఖ్యత ఎక్కువ అనిపించిన అంతర్వికీ లింకులు మాత్రమే చేర్చండి.