వికీపీడియా:Article
డా.బి.వి.పట్టాభిరామ్ డా।। బి.వి. పట్టాభిరామ్ సైకాలజీలో పిహెచ్ .డి. చేశారు. రచయితగా, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా అందరికీ సుపరిచితులు. తన ప్రదర్శనలతో ప్రపంచం నలుమూలలా అభిమానులను సంపాదించుకున్న పట్టాభిరామ్ రచనలు తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో అత్యధిక పాఠకాదరణ కలిగిన రచయితగా సంచలనం సృష్టిస్తున్న డా।। బి.వి.పట్టాభిరామ్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతోపాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సుసులు నిర్వహిస్తున్నారు. ఇతని పూర్తిపేరు భావరాజు వేంకట పట్టాభిరామ్. ఉస్మానియా యునివర్సిటీ నుండి పిహెచ్.డి. పట్టా పొందిన ఇతను సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టానందుకున్నారు. గైడెన్స్,కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. యూఎస్‌ఏ, నష్‌విలే మేయర్ మరియు న్యూ ఓర్లీయన్స్ సిటీస్ నుండి గౌరవ పౌరసత్వం అవార్డును అందుకున్నారు.యావత్భారత దేశమంతానే కాకుండా యు.యస్.ఏ, యూకె,ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆఫిక్రా, సింగపూర్, దుబాయ్, మలేషియా, థాయ్ లాండ్, టాంజానియా వంటి దేశాలను సందర్శించి ఎన్నో వేల వర్కుషాపులు నిర్వహించారు. స్వయంగా ప్రశాంతి కౌన్సిలింగ్ మరియు హెచ్.ఆర్.డి సెంటరును నెలకొల్పి నిర్వహిస్తున్నారు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అకాడమీ, షార్ శ్రీహరి కోట,జుడిషియల్ అకాడమీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్,జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (Naarm),డాక్టరు మర్రి చెన్నారెడ్డి మానవనరుల సంస్థ (IOA),భారత్ ఎలక్రనిక్స్ లిమిటెడ్ హైదరాబాదు మరియు మచిలీపట్నం,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ (NIRD),సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (CIRE),సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, డిఆర్ డి ఎల్,డెల్,డెలాయిట్,ఇంకా రామకృష్ణ మఠం, రెడ్డిల్యాబ్స్,మహింద్రా సత్యం, జీఈ, బేయర్ బయోసైన్స్, జేఎన్ టీయు అకాడమీ స్టాఫ్ కాలేజి, ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజీ, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్(బెల్) ఇంకా ఎన్నో విద్యాసంస్థలకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసం మీద, మానవవిలువల మీద మరియు మ్యాజిక్ మీద తెలుగు,కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో 110కి పైగా గ్రంథాలు రచించారు.
డా.బి.వి.పట్టాభిరామ్ | |
---|---|
వృత్తి | సైకాలజిస్టు |
ప్రసిద్ధి | డా.బి.వి.పట్టాభిరామ్ |
వెబ్‌సైటు | |
http://www.pattabhiram.com/ |
పుట్టుక-కుటుంబ నేపథ్యం
[మార్చు]విద్యాభ్యాసం
[మార్చు]:
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఉద్యోగ జీవితం
[మార్చు]రచనలు
[మార్చు]ప్రచురణ పేరు | ప్రచురణ సం. |
---|---|
చాణక్యతంత్రం | |
మాజిక్ ఆఫ్ మహాత్మా | |
ఒత్తిడి కూడా వరమే | |
వైజ్ఞానిక హిప్నాటిజం | |
సర్దుకుపోదాం... రండి | |
కాలేజ్ క్యాంపస్ | |
సాఫ్ట్స్కిల్స్ | |
నాలుగోఆపిల్ | |
కౌన్సిలింగ్ సీక్రెట్స్ | |
నేనుసైతం | |
కష్టపడి పనిచేయొద్దు! ఇష్టపడి పనిచేయండి!! | |
సూత్రధారులు | |
ఒక్కడు | |
గుడ్ పేరెంట్ | |
గుడ్ స్టూడెంట్ | |
కష్టపడి చదవొద్దు-ఇష్టపడి చదవండి | |
జీనియస్ మీరుకూడా... | |
మాటేమంత్రం | |
టర్నింగ్ పాయింట్ | |
పాఠం చెప్పడం ఒక కళ | |
గుడ్ టీచర్ | |
విజయం మీదే | |
లీడర్‌షిప్ | |
మాస్టర్‌మైండ్ | |
మీరు మారాలనుకుంటున్నారా? | |
మైండ్ మేజిక్ | |
నో ప్రాబ్లెం (సందేహాలు-సమాధానాలు) | |
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ | |
కమ్యూనికేషన్స్ మీ విజయానికి పునాది | |
నాయకత్వలక్షణం విజయానికి తొలిమెట్టు | |
జ్ఞాపకశక్తి – ఏకాగ్రత | |
మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందండి | |
సెల్ఫ్ హిప్నాటిజం-రిలాక్సేషన్ | |
పాజిటివ్ థింకింగ్ | |
గుడ్ పేరెంట్స్+బెటర్ టీచర్స్ = బెస్ట్ స్టూడెంట్ | |
అద్భుత ప్రపంచం అతీంద్రియశక్తులు | |
మాయావినోదం పేరున :-మేథ్స్ మేజిక్, సూపర్ మేజిక్, స్కూల్ మేజిక్, సైన్స్ మేజిక్, స్టూడెంట్ మేజిక్ | |
బంగారుబాట పేరున :- జాతినేతలు,కళాకారులు, సాహిత్యవేత్తలు, సమాజసేవకులు, శాస్త్రవేత్తలు, స్ఫూర్తిప్రదాతలు | |
వెలుగుబాట పేరున:- ప్రపంచ ప్రఖ్యాత,శాస్త్రవేత్తలు-1, 2, 3, ప్రఖ్యాత భారతీయశాస్త్రవేత్తలు,స్ఫూర్తిప్రదాతలు-1, 2, 3, 4 | |
ఎదగడానికి ఏడు మెట్లు పేరున :- ఆత్మవిశ్వాసం,స్వయంకృషి, దేశభక్తి, ఆత్మాభిమానం, మనోబలం, పట్టుదల, క్రమశిక్షణ | |
Genius you too (Eng) | |
Mind Magic (Eng) | |
Master Mind (Eng) | |
Good Teacher (Eng) | |
Soft Skills (Eng) | |
Winner’s Mantras (Eng) |
గౌరవ పురస్కారాలు
[మార్చు]పేరు | హోదా | సంవత్సరం |
---|---|---|
శ్రీ శంకర్ దయాల్ శర్మ | అధ్యక్షుడు | |
శ్రీ ఆర్.వెంకట్రామన్ | అధ్యక్షుడు | |
శ్రీ అబ్దుల్ కలాం | అధ్యక్షుడు | |
శ్రీ రాజీవ్ గాంధీ | ప్రధాని | |
శ్రీ పి.వి.నరసింహారావు | ప్రధాని | |
శ్రీ రంగరాజన్ | గవర్నర్ | |
శ్రీమతి కుముద్ బెన్ జోషి | గవర్నర్ | |
శ్రీ కెసి అబ్రహం | గవర్నర్ | |
శ్రీ రామ్‌లాల్ | గవర్నర్ | |
శ్రీమతి శారదా ముఖర్జీ | గవర్నర్ | |
శ్రీ ఎన్.డి తివారీ | గవర్నర్ | |
శ్రీ రోశయ్య | గవర్నర్ | |
శ్రీ అంజయ్య | ముఖ్యమంత్రి | |
శ్రీ ఎన్.టి.రామారావు | ముఖ్యమంత్రి | |
శ్రీ కోట్ల విజయ భాస్కర రెడ్డి | ముఖ్యమంత్రి | |
శ్రీ నేదురుమల్లి జనార్థన్ రెడ్డి | ముఖ్యమంత్రి | |
శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి | ముఖ్యమంత్రి | |
శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి | ముఖ్యమంత్రి | |
శ్రీ చంద్ర బాబు నాయుడు | ముఖ్యమంత్రి |
ఆధారాలు
[మార్చు]- ఎమెస్కో వెబ్‌లో పట్టాభిరామ్ గారి పుస్తకాలు
- అమెజాన్‌లో పట్టాభిరామ్ గారి పుస్తకాలు
- ఫ్లిప్‌కార్ట‌్‌లో పట్టాభిరామ్ గారి పుస్తకాలు
- కీర్తి పురస్కార గ్రహీతల జాబితా (1986-2014)
- విశ్వవిద్యాలయ ప్రచురణ తెలుగువాణి సంచిక (ఏప్రిల్ - ఆగష్టు 2016)లో 2014 కీర్తి పురస్కార వివరాలు
https://www.youtube.com/watch?v=ElJD-O_9iKcయూట్యూబులో...