వికీపీడియా చర్చ:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం-2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గతంలో అవార్డు పొందినవారి అర్హతా నియమాలు

[మార్చు]

గత సంవత్సరం అవార్డు పొందినవారిని మళ్ళీ ఈ సంవత్సరం అవార్డుకు పరిగణించవచ్చా? అన్న విషయంపై ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రెండు ప్రతిపాదనల్లో మధ్యేమార్గమైన ప్రతిపాదనకు చివరకు మొగ్గుచూపినారు. ఈ విషయం సమగ్రంగా చర్చకువచ్చి ఓ విధాన రూపకల్పన జరగి ఆ ప్రకారం భవిష్యత్తులో అవార్డుల ఎంపిక సాగుతుందన్న ఉద్దేశంలో ఇక్కడ ఆ ప్రతిపాదనలు పెడ్తున్నాను. సభ్యులు గమనించగలరు.

  1. కొత్తగా తెవికీలో కృషి ప్రారంభించినవారిని ప్రోత్సహించేందుకు గాను ఒకసారి ఈ అవార్డు వచ్చినవారిని తిరిగి మళ్ళీ ఈ అవార్డు వరించరాదన్న ప్రతిపాదన మొదటిది. ఈ ప్రతిపాదన ప్రకారం ఒకసారి గతంలో అవార్డు వచ్చినవారే గనుక మళ్ళీ తెవికీ గణాంకాలు, నాణ్యతా ప్రమాణాల పరంగా ఉత్తమమైన కృషిని ప్రదర్శించి అవార్డు ప్రమాణాలకు అర్హులైవుంటే వారిని కార్యక్రమంలో ఘనంగా సత్కరిస్తారు. ఈ ప్రతిపాదన చేసిన వారి ప్రకారం ప్రతిసారీ అలాంటి అత్యుత్తమ కృషి చేసేవారు అవార్డుకన్నా పెద్ద వ్యక్తులుగా పరిగణించవలసి వుంటుంది. ఈ ప్రతిపాదన ముఖ్యంగా రాజశేఖర్ గారు, విశ్వనాథ్ గారు తీసుకువచ్చారు.
  2. తద్విరుద్ధంగా గత సంవత్సరం అవార్డు స్వీకరించినవారికైనా ఈ సంవత్సరం అవార్డు ఇవ్వాలనేది మరో ప్రతిపాదన. దీని ప్రకారం అవార్డు పొందినవారికి అవసరమైతే మరింత పెద్ద ప్రమాణాలు నిర్ణయించుకోవచ్చు, ఇప్పటికే అవార్డు రానివారికి తక్కువ ప్రమాణం నిర్ణయించవచ్చు. ఆ ప్రమాణాలను అందుకున్నవారికే తిరిగి అవార్డు వస్తుంది. కావాలంటే ఉన్న అవార్డు సంఖ్య పెంచి, నగదు బహుమతిని తదనుగుణంగా విభజించి తగ్గించవచ్చని దీనిలో మరో ముఖ్యాంశం. ఈ ప్రతిపాదన చేసినవారు ఎల్లంకి భాస్కర నాయుడు గారు.
  3. మూడవ ప్రతిపాదన పరంగా ఒక సంవత్సరం అవార్డును స్వీకరించినవారిని మొత్తంగా ఎప్పటికీ పరిగణించకుండా వుండడం కాకుండా వెన్వెంటనే వచ్చే సంవత్సరపు అవార్డుకు పరిగణించరు. అంటే 2014లో అవార్డును స్వీకరించినవారిని 2015లో అవార్డుకు మళ్ళీ ప్రతిపాదించడమనేది ఉండదు. ఆ పై వచ్చే సంవత్సరానికి అంటే 2014లో పురస్కారం పొందినవారు 2016లో అందించే అవార్డు పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ ఏ సంవత్సరమైనా అవార్డుకు జ్యూరీని పెట్టదలుచుకుంటే ముందు సంవత్సరం అవార్డు స్వీకరించి ఉండి తెవికీలో కృషిని కొనసాగిస్తూన్న సభ్యులను జ్యూరీకి ముఖ్యపదవిలో నియమించవచ్చు. ఈ ప్రతిపాదన ప్రకారం అప్పటికే ఒకసారి అవార్డు వచ్చేంత స్థాయిలో కృషి చేసి, ఆపై సంవత్సరం కూడా అత్యుత్తమ స్థాయిలో కృషిని కొనసాగిస్తూన్న సభ్యులు జ్యూరీ సభ్యులుగా ఉండడం అవార్డుకు వన్నె తెస్తుంది. తద్వారా ఎంపికలో నాణ్యత పెరుగుతుంది విలువ హెచ్చుతుంది. ఈ ప్రతిపాదన చేసినవారు పవన్ సంతోష్