వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/గ్రాంటు వినియోగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 గ్రాంటు వినియోగ పూర్తి వివరాలు[మార్చు]

సాయికిరణ్ గారూ పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టుకు వికీమీడియా ఫౌండేషన్ వారి ద్వారా ప్రాజెక్టు నిర్వహకుడుగా రు 2,94,756 రూపాయలు గ్రాంటును మీరు పొందారు.అయితే ఈ మొత్తాన్ని ఏ విధంగా, ఏ పద్దులకు లేదా ఇతరత్రా కార్యక్రమాలకు ఎలా ఎంత ఖర్చు పెట్టారో ఖర్చుచేసిన గ్రాంటు పూర్తి వివరాలు, ఇంకా దానిలో ఇంకా ఏమైనా గ్రాంటు మిగిలిందా, ఒక వేళ మిగిలితే దానిని వికీమీడియా ఫౌండేషన్ వార్కి తిరిగి చెల్లించారా లేక దానిని తెలుగు వికీపీడియా ఇతర ప్రాజెక్టులలో వినియోగించబడినవా?ఈ గ్రాంటు ద్వారా తెలుగు వికీపీడియాకు ఎలాంటి అభివృద్ధి ఏ విధంగా ఎవరిరెవరి ద్వారా ఏ విధంగా చేకూరింది, ఇలాంటివాటిపై నివేదిక, ఏ ప్రాజెక్టు పేజీలలలో నాకు తెలిసినంతవరకు ఎక్కడా లభ్యంలో లేదని తెలుస్తుంది.ఒక వేళ నేను పొరపాటుపడ్డానో అర్థం కాకుండా ఉంది.కావున పైన తెలిపిన పూర్తి వివరాలు మీరు తెలిపిఉంటే ఆ లింకు తెలుపగలరు. ఒక వేళ అలాంటింది ఏమీ లేకపోతే సమయం తీసుకుని పూర్తి వివరాలు అంటే రు:2,94,756 గ్రాంటుకు సమానమైన ఖర్చు వివరాలు పద్దులు ద్వారా తెలుపగలరు. ధన్యవాదాలు. అన్యథా భావించవద్దు. యర్రా రామారావు (చర్చ) 14:22, 29 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారు, ఈ గ్రాంటు విషయమై కిందటి సారి తెలుగు వికీ వార్షికోత్సవ చర్చలో స్పందించటం జరిగింది. దానిని మీరు వికీపీడియా చర్చ:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2022 పేజీలోని "తేదీ ప్రదేశం నిర్వహణ వగైరాలు" అంశంలో చూడవచ్చు. గ్రాంటు వినియోగం అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా జరిగిన అభివృద్ధి పనుల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

గ్రాంటులో అక్షరాలా 53000 మిగిలి ఉంది దాని ఉపయోగార్థం సముదాయంలో చర్చ చేయవలసి ఉంది. ధన్యవాదాలు NskJnv 14:08, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సాయికిరణ్ గారూ నేను అడిగిన సమాచారానికి ఈ లింకు ఇక్కడ ఇస్తే సరిపోయేది.దీని కోసం కొద్దిగా శ్రమ పడాల్సివచ్చింది. ఏది ఏమైనా గ్రాంటు వినియోగ సమాచార వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 09:01, 18 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]