విప్పర్తి ప్రణవమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విప్పర్తి ప్రణవమూర్తి ప్రముఖ వైద్యులు. ఆయన 1994 నుండి 2001 వరకు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కస్పా పెంటపాడు గ్రామంలో 1942 ఫిబ్రవరి 1 న జన్మించారు. తండ్రి పేరు సూర్యనారాయణరావు. ఆంధ్ర మెడికల్ కళాశాల (విశాఖపట్నం) నుండి 1965 లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీని పొందారు. తరువాత 1970లో ఎం.డి జనరల్ మెడిసన్ పట్టాను పొందారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సివిల్ అసిస్టెంటు సర్జన్ గా చేరారు. శస్త్ర చికిత్సా రంగంలో పరిశోధనలు చేసారు. కింగ్ జార్జి హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగంలో ఉండి ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొందారు. విపిటి సిల్వర్ జూబ్లీ హాస్పటల్ కు , సెయింట్ ఆన్స్ హాస్పటల్ కు గౌరవ వైద్య సలహాదారుగా జీవిత పర్యంతం ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ లో అనేక పరిశోధనా పత్రాలను వెలువరించారు. Chironix Flickeii Jelly Fish Poisioning finding అనే అంశం మీద విశేష పరిశోధనలు చేసారు. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడిసన్ విద్యార్థులకు (హారిసన్ విశ్వవిద్యాలయం) పాఠ్య గ్రంథం రాసారు. రాష్ట్ర ప్రభుత్వం వారి "బెస్ట్ ఫిజీషియన్" పురస్కారాన్ని పొందారు.

సాహితీకారుడిగా, కళాకారుడిగా విశాఖ ప్రజలకు సుపరిచితులు[2]. రెండు కథా సంపుటాలను వెలువరించారు[3]. కుమార్తె పేరు మీద "హిమబిందు అకాడమీ పాఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్" సంస్థను నెలకొల్పారు. 2004 మార్చిలో మద్రాసులో ఆకశ్మిక మరణంపొందారు.[4]

మూలాలు[మార్చు]

  1. "ABOUT US, అంధ్ర వైద్య కళాశాల, అధికార వెబ్‌సైట్". Archived from the original on 2017-03-05. Retrieved 2017-05-01.
  2. Praṇavamūrti, Vipparti 1942-
  3. కథానిలయంలో రచయిత: విప్పర్తి ప్రణవమూర్తి
  4. In Visakhapatnam Today