Jump to content

విశ్వనాథ పంచశతి

వికీపీడియా నుండి

విశ్వనాథ పంచశతి.[1] లో ఐదు వందల పైచిలుకు పద్యములు ఉన్నాయి అందులో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావన జేయుట జరిగింది.

విశ్వనాథ పంచశతి (శతక సాహిత్యము)

[మార్చు]

విశ్వనాథ పంచశతి.[1] లో ఐదు వందల పైచిలుకు పద్యములు ఉన్నాయి అందులో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావన జేయుట జరిగింది.
రచన : విశ్వనాథ సత్యనారాయణ

తేటగీతి:
చిన్న యుద్యోగ మిమ్మని చేరఁ బోవ
బ్రాహ్మణు డవని గుమ్మమ్ము పారఁ దోలె
బ్రాహ్మణుండె కలెక్టరు వచ్చినంత
నడుగు నడుగున వలిపపు ముడుగులొత్తె

తేటగీతి:
నీకు నుద్యోగ మింతయు లేక నాలు
గేండ్లుగా స్నేహితుల బిచ్చ మెత్తు చుంటి
వీధి వాకిట నిలచిన బిచ్చగాని
గూలి సేయ రాదా యని కోపగింతు

మూలాలు, వనరులు

[మార్చు]