వి.నాగిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.నాగిరెడ్డి
జననం
వెంకమోళ్ల నాగిరెడ్డి

1955
వృత్తితెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌‌
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్

వెంకమోళ్ల నాగిరెడ్డి 1980 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ కర్ణాటక కేడర్‌ అధికారి & 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌‌గా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

వి.నాగిరెడ్డి తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా (ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా), పుల్కల్ మండలం, పెద్దారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. ఆయన పెద్దారెడ్డిపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి వరకు , జోగిపేట ఉన్నత పాఠశాలలో 6వ తరగతి 10 వరకు, జోగిపేట్ నెహ్రూ మెమోరియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆయన హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏజీ బీఎస్సీ పూర్తి చేశాడు.

వి.నాగిరెడ్డి బెంగుళూరులో ఎమ్మెస్సీ పూర్తి చేసి, 1979-80లో సివిల్స్ రాసి ఐఎఫ్‌ఎస్ కర్ణాటక కేడర్‌కు ఎంపికయ్యాడు. ఆయన ఐఎఫ్‌ఎస్ శిక్షణ అనంతరం మంగళగిరి డీఎఫ్‌ఓగా పనిచేశాడు. వి.నాగిరెడ్డి 1984లో రెండవసారి సివిల్స్ రాసి ఐఏఎస్‌గా ఎంపికయ్యాడు.[2]

వృత్తి జీవితం[మార్చు]

  • 1984లో కొత్తగూడెం, పెనుగొండ సబ్‌కలెక్టర్‌
  • 1988-89 పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌
  • 1989-91 రంగారెడ్డి జిల్లా డీఆర్‌డీఏ పీడీ
  • 1991-92 ఉద్యానవన (హార్టికల్చర్) రాష్ట్ర డెరైక్టర్‌
  • 1992-95 విజయనగరం జిల్లా కలెక్టర్‌
  • 1995లో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్‌
  • 1996-97 అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ జాయింట్ సెక్రటరీ
  • 1997-98 కడప కలెక్టర్‌
  • 1999-2000 ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ ఎండీ
  • 1999-2004 పంచాయతీ రాజ్ కమిషనర్‌, సహకార శాఖ రాష్ట్ర కార్యదర్శి
  • 2004 - 2009 గిరిజన, సంక్షేమ, పర్యాటక శాఖల అధికారి
  • 2009 - 2012 పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల ప్రధాన కార్యదర్శి
  • 2012 - 2014 ఎన్జీరంగా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌
  • 2014 -2015 ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి
  • 2015 - ఏప్రిల్‌ 2020 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ [3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (6 November 2014). "నాగిరెడ్డి మనోడే". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  2. Sakshi (25 October 2014). "తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి!". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  3. The Times of India (2014). "Nagi Reddy appointed SEC chief". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.