వి. సునీల్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి. సునీల్ కుమార్

విద్యుత్ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021
ముందు బి.ఎస్.యడ్యూరప్ప

కన్నడ భాషా, సంస్కృతి శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021
ముందు అరవింద్ లింబావాలి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2013
ముందు హెచ్. గోపాల్ భండారీ
నియోజకవర్గం కర్కాల
పదవీ కాలం
2004 – 2008
ముందు హెచ్. గోపాల్ భండారీ
తరువాత హెచ్. గోపాల్ భండారీ
నియోజకవర్గం కర్కాల

వ్యక్తిగత వివరాలు

జననం (1975-08-15) 1975 ఆగస్టు 15 (వయసు 48)
మూడిగెరె, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రియాంక
సంతానం 3
నివాసం కర్కాల

వి. సునీల్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు కర్కాల అసెంబ్లీ నియోజకవగం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో కన్నడ భాషా, సంస్కృతి, విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

వి. సునీల్ కుమార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో సాధారణ కార్యకర్తగా పనిచేసి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2004లో జరిగిన ఎన్నికల్లో కర్కాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యాడు. ఆయన 2008లో ఓడిపోయి, తిరిగి 2013లో రెండోసారి, 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వి. సునీల్ కుమార్ 2021 ఆగస్టు 4 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో విద్యుత్, కన్నడ భాషా, సంస్కృతి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.