జాల విహరిణి
Appearance
(వెబ్ బ్రౌజర్ నుండి దారిమార్పు చెందింది)
జాల విహారిణి (వెబ్ బ్రౌజర్) అనేది అంతర్జాలంలో వున్న సమాచారాన్ని మనకు చూపించే సాప్టువేర్ అనువర్తనము. దీనితో సమాచారాన్ని పొందటం, ప్రదర్శించటం, ఒక సమాచార వసతి నుండి ఇంకోసమాచార వసతికి మారటం చేయవచ్చు. సమాచారవసతిని ఏకరూప వనరు గుర్తు (యూనిఫార్మ్ రిసోర్స్ ఐడెంటిఫయర్) గా పేర్కొంటారు.దీని రూపం వెబ్ పేజి, చిత్రం, చలచిత్రం, లేదా మరోవిధమైన విషయభాగం కావొచ్చు.
- వీటిలో ప్రధానమైనవి
- ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్ ఇప్పుడు మైక్రొసాఫ్ట్ ఏడ్జ్
- ఫైర్‌ఫాక్స్ : ఫైర్‌ఫాక్స్ అంతర్జాల విహరిణి. దీనిని మొజిల్లా ఫౌండేషన్ చాలామంది స్వచ్ఛందకార్యకర్తల సహకారంతో తయారు చేస్తుంది. ఇది గోప్యతలేని మూలాల సాఫ్టువేర్.
- సఫారి
- గూగుల్ క్రోమ్
- ఒపేరా