వెలమాటి రాందాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెలమాటి రాందాస్ వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా , కొవ్వలి గ్రామంలో ఫిబ్రవరి 2 1923 న జన్మించారు. 1948లో వైద్య విద్యను ఆంధ్ర మెడికల్ కళాశాల నుండి అభ్యసించారు. 1951లో మద్రాసులో టిడిడి ను, 1952లో మద్రాసు నుండి డి.ఎం.ఆర్ పట్టాను, 1954లో ఎం.ఆర్.సి.పి ను ఎడిన్‌బర్గ్ నుండి అందుకున్నారు. 1990 లో ఎడిన్‌బర్గ్ నుండి ఎఫ్.ఆర్.సి.పి ను అందుకున్నారు.[1]

ఉన్నత విద్యాభ్యాసం అనంతరం విదేశాలలో పరిశోధనలు నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన ఎడెన్‌బర్గ్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ల గౌరవ సభ్యత్వం అందుకున్న అతి కొద్ది మంది వైద్యులలో ఈయన ఒకరు[2]. వైద్య పరిశోధన, చికిత్స రంగంలొ అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. దేశ, విదేశీ సైన్స్ జర్నల్స్ లో అనేక పరిశోధనా వ్యాసాలు రాసారు[3][4]. హైదరాబాద్ లోని గాధీ హాస్పటల్, చెస్ట్ ఆసుపత్రిలలో ప్రొఫెసరుగా పనిచేసారు. ఆస్తమా వ్యాధిమీద గణనీయ పరిశోధనలు చేసారు. హైదరాబాదులో స్థిరపడి కాలుష్య దుష్పరిమాణాలు మీద గ్రంథ రచనలు చేసారు. ఆస్తమా వ్యాధి చికిత్సా రంగంలొ విశేష అనుభవం గడించారు.[2] జూన్ 24 2006 న మరణించారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 In memoriam 2013 Royal College of Physicians of Edinburgh
  2. 2.0 2.1 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011.
  3. Simulated Evolution and Learning: 9th International Conference, SEAL 2012 ...
  4. Autism Spectrum Disorder