వైదిక సెంజలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైదిక సెంజలియా
జననం (1996-05-19) 1996 మే 19 (వయసు 27)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థమహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2014 - ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • జగదీష్ సెంజలియా (తండ్రి)
  • జిగ్నాస (తల్లి)

వైదిక సెంజలియా భారతీయ మోడల్, నటి. సోనీ సబ్ టీవీ సిరీస్ సిట్‌కామ్ భఖర్‌వాడిలో ఆమె నటనకు బాగా ప్రసిద్ది చెందింది. అలాగే, జీ టీవీ తుజ్ సే హై రాబ్తాలో ఉత్తరా దీక్షిత్ పాత్ర కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.[1]

లెన్స్‌కార్ట్, టేస్టీ ట్రీట్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌ల ప్రకటనలలో మోడల్‌ గా ఆమె చేసింది. 2017లో, ఆమె హాష్ లవ్ థాయ్ గయో గుజరాతీ చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో, టీవీ సిరీస్ లాల్ ఇష్క్ తో ఆమె టెలివిజన్ అరంగేట్రం చేసింది.

2023లో, నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్యకృష్ణను కథానాయకుడుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న బ్రీత్‌ సినిమాలో వైదిక సెంజలియా కథానాయిక.[2]

ప్రారంభ జీవితం[మార్చు]

గుజరాత్‌లోని వడోదరలో 1996 మే 19న ఆమె జిగ్నాస, జగదీష్ సెంజలియాల దంపతులకు జన్మించింది. ఆమెకు మీట్ సెంజలియా అనే తమ్ముడు ఉన్నాడు. ఆమె మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో చదివింది. పద్దెనిమిదేళ్ల వయస్సులో, ఆమె 2014లో లక్మే మిస్ గుజరాత్ విజేతగా తన మొదటి టైటిల్‌ను పొందింది. అలా ఫ్యాషన్ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె వివిధ భారతీయ బ్రాండ్‌లకు లీడ్ మోడల్ పాత్రలను పోషించింది.

మూలాలు[మార్చు]

  1. "Featured Bollywood Movie News | Featured Bollywood News - Bollywood Hungama". web.archive.org. 2023-11-14. Archived from the original on 2023-11-14. Retrieved 2023-11-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ప్రపంచం చూడని కొత్త క్రైమ్‌ |". web.archive.org. 2023-11-14. Archived from the original on 2023-11-14. Retrieved 2023-11-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)