సత్తిరాజు శంకర నారాయణ
సత్తిరాజు శంకర నారాయణ | |
---|---|
జననం | సత్తిరాజు శంకర నారాయణ 1936 నర్సాపురం |
ఇతర పేర్లు | శంకర్ |
వృత్తి | ఆకాశవాణి లో 1963 నుండి పనిచేశారు 1995 లో చెన్నై స్టేషను డైరెక్టర్ |
ప్రసిద్ధి | చిత్రకారుడు |
చిత్రకారుడు శంకర్
[మార్చు]సత్తిరాజు శంకర నారాయణ (శంకర్) చిత్రకారుడు, దర్శకుడు ఐన బాపు తమ్ముడు. . శంకరనారాయణ బాబాయి బుచ్చిబాబు ప్రముఖ రచయిత, కళాకారుడు. ఆకాశవాణిలో 1963 నుండి కొలువులో ఉండి, అనేక విధాలుగా సేవలందించి 1995 లో చెన్నై స్టేషను డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాక, తనకు ఆసక్తి ఉన్న చిత్రకళా రంగంలో కృషి చేస్తున్నాడు. పలు రంగాలలో ఉన్న ప్రఖ్యాత భారతీయ వ్యక్తుల చిత్రాలను గీస్తూ, పలువురి మన్ననలందుకున్నాడు. 2008 లో హాసరేఖలు అనే పుస్తకం, శంకర్ గీసిన 80 మంది ప్రఖ్యాత భారతీయుల చిత్రాలతో, హాసం ప్రచురణలు వారిచే ప్రచురించబడింది. శంకర్ బొమ్మల కొలువు అనే పేరుతో, శంకర్ చిత్రాలు అక్టోబరు 2011 లో, హైదరాబాదు లోని ICCR Art Gallery రవీంద్రభారతిలో ప్రదర్శించబడ్డాయి. శాస్త్రియ సంగీత కళాకారుల చిత్రాలను కార్పొరేషన్‌వారు తమ పురావస్తు చిత్రాల భాండాగారాల్లోనూ, చెన్నై మ్యూజిక్ అకాడమివారు ఏరి నృత్యకళాకారుల చిత్రాలను తమ అకాడమి పురాచిత్ర భాండాగారంలో భద్రపరచకున్నారు. 10 మంది కన్నడ సాహితీ ప్రముఖులు చిత్రాలలో ఏడుగురు 'జ్ఞానపిఠ్ (/గ్రహితలు. ఆయన గీసిన చిత్రాలు 2007లో మైసూర్‌లో ఒక (ప్రత్యేక (ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 40 మంది సినిహాస్యనటులు, 40 మంది ఇతర సిని, సంగీత, దర్శక (ప్రముఖుల చిత్రాల్లో శ్రీ శంకర్ రూపొందించిన పుస్తకం “హాస రెఖలు” (2008లో) హైదరాబాద్‌లో హాసం ప్రచురణల ద్వారా ప్రచురింపబడి ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరింపబడింది.
శంకర నారాయణ గారు కూడా స్వయంగా చిత్రకారులు.పెన్సిల్ తోనూ, చారోకోల్ తోనూ అనేకమంది ప్రముఖుల క్యారికేచర్ లు చిత్రించారు.దాదాపు 1500 కు పైగా అటువంటి అద్భుతమైన బొమ్మలు వేసి ఆయన ఇటీవలే ఇండీయన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందారుకూడాను.
- ఈయన ప్రతిభను గుర్తించి 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్' లో కూడా స్థానం ఇస్తూ ధ్రువీకరణ పత్రాన్ని 2014 లో అందజేసింది.