వాడుకరి చర్చ:Rajashekhar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

Rajashekhar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Rajashekhar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  

బొమ్మ:Seshendra.jpg లైసెన్సు వివరాలు

[మార్చు]

Rajashekharగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Seshendra.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 09:35, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]