సముచిత వినియోగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Fair use logo
A fair use logo.[1][2]
For అమెరికా చట్టాల ప్రకారం వ్యాపార చిహ్నాల సముచితవినియోగం, see Fair use (US trademark law). For అతివేగమైన జాలసంధానానికి పౌనపుణ్యనిర్వహణ విధానం, see Fair Access Policy. For వికీపీడియాలో నకలుహక్కులు గల కృతులను సముచితవినియోగానికి, see Wikipedia:Non-free content.

సముచిత వినియోగం (Fair use) అనేది కాపీరైట్ చట్టం ప్రకారం కృతికర్తలకు ఆ కృతుల ఫలితాన్ని అనుభవించడానికి కల్పించబడే హక్కుకు పరిమితి మరియు మినహాయింపు. అమెరికా కాపీరైట్ చట్టంలో సముచిత వినియోగం అనేది చట్టవిధానం. దీని వలన హక్కుదారులనుండి అనుమతి పొందకుండా కాపీరైట్ హక్కులున్న కృతులను వాడుకోవడానికి వీలుకల్పిస్తుంది. వ్యాఖ్యానానికి, శోధనాయంత్రాలకు, విమర్శలకు, వార్తానివేదికలకు,పరిశోధనకు, బోధనకు, గ్రంథాలయ నిల్వలకు మరియు మేధోపరమైన వినియోగానికి దీనివలన వీలుంది. నాలుగు అంశాలతోకూడిన తుల్య పరీక్ష ప్రకారం నకలుహక్కులు విషయాన్ని చట్టపరంగా మరియు అనుమతి లేకుండా వేరొక కృతిలోవాడడం వీలవుతుంది.

సముచిత వినియోగ మనేది అమెరికాలో ప్రారంభమైంది. అటువంటి విధానాలు ఇతర దేశాల చట్టాలలో వున్నాయి. ఇది సాంప్రదాయమైన భద్రతా కవాటాలలో ఒకటి.