సార్డీనియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Topographic map of Sardinia
View of Gennargentu, the highest massif of Sardinia
Lake Omodeo, the largest reservoir in Italy

సార్డీనియా

మెడిటరేనియన్ సముద్రంలోని రెండవ పెద్ద ద్వీపం (మొదటిది సిసిలీ) అయిన సార్డీనియా ఇటలీలో ఓ భాగం. 23821 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ద్వీపంలో పర్యాటకులు చూడదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. ఈ ద్వీపంలో 68% పర్వతాలే. కేవలం 18.5% మాత్రమే మైదాన భూమి. టునీషియాకి దగ్గరగా ఉండే సార్డీనియాలో

చూడదగ్గ విశేషాలు[మార్చు]

అసినారా నేషనల్ పార్క్[మార్చు]

దీనికి ఐసోలాడెల్ డియావోలో (డెవిల్స్ ఐలాండ్) అని ముద్దు పేరు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇది జైలుగా ఉపయోగించబడేది. 1997లో ఇక్కడ ఈ నేషనల్ పార్క్‌ని ఆరంభించారు. ఈ పార్కులో పర్యాటకులు గాడిదలతో ఫొటోలు తీసుకుంటారు. కారణం అవి అర్బినో అంటే తెల్లగాడిదలు. అసినారా అనే 52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ ద్వీపం నిండా తెల్ల గాడిదలు ఉంటాయి. ఇక్కడ మంచినీళ్లు తక్కువ కాబట్టి, చెట్లు కూడా తక్కువే. కాగ్లియారీ: ఇది సార్డీనియా రాజధాని. జనాభా లక్షా ఏభై ఆరువేలు. ఇది ప్రాచీన పట్టణం. సాంస్కృతిక, విద్యా, రాజకీయ కళా కేంద్రమే కాక పారిశ్రామిక కేంద్రం కూడా. మెడిటరేయన్ సముద్రంలోని అతి పెద్ద నౌకాశ్రయం ఇక్కడే ఉంది. ఇక్కడి యూనివర్సిటీ ఆఫ్ కాగ్లియారీకి ఐరోపా, అమెరికా, జపాన్‌ల నించి విద్యార్థులు చదువుకోడానికి వస్తూంటారు. ఇక్కడి రోమ్ స్క్వేర్‌లో పర్యాటకులు షాపింగ్ చేసుకోవచ్చు. ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. యెనే్న స్క్వేర్ ఇలాంటి మరో సిటీ సెంటర్. ఈ నగరంలోని కాగ్లియారీ రాయల్ ప్యాలెస్ చూడదగ్గ మరో పర్యాటక ఆకర్షణ.

స్టాంపేస్:[మార్చు]

ఇది కాగ్లియారీ నగరంలోని ముఖ్యమైన ప్రాంతం. సిటీ సెంటర్‌లోగల ఇక్కడి కేజిల్ ఆఫ్ కాగ్లియారీ చూడదగ్గది. 13వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కోటలో నేడు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ కాగ్లియారీ హెడ్‌క్వార్టర్స్ కూడా ఇక్కడి పద్దెనిమిదో శతాబ్దపు ప్యాలెస్‌లో ఉంది. ఈ ప్యాలెస్‌కి వెళ్లే సన్నటి దారులు ప్రాచీన భవంతుల మధ్య చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఈ ప్యాలెస్‌లో చర్చి, ఆర్కియలాజికల్ మ్యూజియం, నేషనల్ ఆర్ట్ గ్యాలరీలని చూడొచ్చు. ఈ ప్యాలెస్‌కి ఓ వైపు ఉన్న ప్యాలెస్ స్క్వేర్, మరోవైపు ఉన్న స్క్వేర్ లమర్‌మోరా రద్దీగా ఉండే పర్యాటక స్థలాలు. ఈ కోటలోని టవర్ ఆఫ్ ది ఎలిఫెంట్ ఈ ఊళ్లోని అతి ఎత్తయిన టవర్. 1307లో నిర్మించబడ్డ మూడు టవర్స్‌లో ఇదొకటి. మిగిలిన రెండూ లయన్ టవర్, ఈగిల్ టవర్. ఆయా జంతువుల విగ్రహాలు ఆ టవర్లకి ఉండటంవల్ల ఆ పేర్లు వచ్చాయి.

కేవ్ ఆన్ మన్నావూ: ఓ కొండలో ఏర్పడ్డ ఎనిమిది కిలోమీటర్ల పొడవుగల ఈ గుహకి గైడ్‌తో వెళ్లాలి. ఈ గుహలో అత్యంత ఎత్తు 153 మీటర్లు. అనేక గదులు కల ఈ గుహ పర్యాటక కేంద్రం. ఆర్కియలాజిస్ట్‌లు కనిపెట్టిన ఈ గుహలో 3 వేల ఏళ్ల క్రితంనాటి ప్రాచీన ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ గుహలో ఓ చోట రివర్ ప్లాసిడో ప్రవహిస్తూంటుంది. ఇక్కడి గబ్బిలం జాతి ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ఇలాగే మరొక గుహ కేవ్ ఆఫ్ శాన్‌జియోవన్నీ కూడా చూడదగ్గది.

లామద్దలేనా:[మార్చు]

సార్డీనియాలోని మరో ప్రసిద్ధ టూరిస్ట్ కేంద్రం ఇది. ఈ ప్రాంతం బీచ్‌లకు ప్రసిద్ధి. 12 వేల జనాభాగల ఇక్కడ పింక్ శాండ్ బీచ్ ప్రధాన ఆకర్షణ. ఆశ్చర్యంగా ఇక్కడి ఇసుక గులాబీ రంగులో ఉంటుంది. 1994 నించి ప్రభుత్వం దీన్ని ఫుల్ ప్రొటెక్షన్ జోన్‌గా డిక్లేర్ చేసింది. 18వ శతాబ్దంనాటి ఈ ఊళ్లో చారిత్రక కట్టడాలు అనేకం చూడొచ్చు. ఇక్కడి మరి కొన్ని బీచ్‌ల పేర్లు కార్లోట్లో, బుడెల్లీ బీచ్, కాలాతాంగా, బసాట్రినిటా మొదలైనవి.

కాపో కార్బనారా:[మార్చు]

ఇక్కడ అరుదైన జాతి చేపలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా బీచెస్‌కి ప్రసిద్ధి. కాలాగోనాన్ ఆర్బాటెక్స్, విలాసిమియస్ లాంటి బీచ్‌లు 200 పైగా ఈ ద్వీపంలో నాలుగు దిక్కులా ఉన్నాయి. అంతేకాక, 60 మీటర్ల ఎత్తుగల ఇసుక దిబ్బలు, పర్వతాలు, చిన్న కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. జల గర్భ గుహలు అల్గేరో ఏరియాలో అధికం. పర్యాటకులు వీటికి స్కూబా డైవింగ్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. సున్నపు రాతి గోడలుగల డోమున్నోవా ప్రాంతం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. డోమస్ డి జనాస్ అంటే మంత్రగత్తె ఇళ్లు అనేకం ఈ ద్వీపంలో కనిపిస్తూంటాయి. ప్రభుత్వ ప్రసిద్ధ ధారోస్ నగరం ఇక్కడే ఉంది. ఇది ప్రాచీన రోమన్ నగరం. క్రీ.పూ.238 నాటి శిథిలాలని నేటికీ చూడచ్చు. ఈ ద్వీపం అంతటా పురాతన చర్చిలు కనిపిస్తాయి. ఇటలీలో చూడదగ్గ ఈ ప్రధాన పర్యాటక కేంద్రానికి రావలసినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడిప్పుడే పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి కాగ్లియారీ - ఎల్‌మాస్ ఏర్‌పోర్ట్ బ్రిటన్, స్కాండివేనియా, స్పెయిన్, జర్మనీల నించి చేరుకోవచ్చు లేదా ఓడలో కూడా రావచ్చు. ఇటలీలో కార్లు నడవడానికి రోడ్లు లేని ఏకైక ప్రాంతం ఇది. ఇప్పుడిప్పుడే రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు. ప్రతీ ఊరికి బస్ సౌకర్యం, రైలు సౌకర్యం కూడా ఉన్నాయి. ఈ ద్వీపానికి తక్కువ మంది పర్యాటకులు వెళ్తూంటారు కాబట్టి, ఇక్కడ రద్దీ ఉండదు. మే నించి సెప్టెంబర్ వరకూ టూరిస్ట్ సీజన్.