సిరిసిల్ల రాజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరిసిల్ల రాజయ్య

నియోజకవర్గం వరంగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-10-05) 1953 అక్టోబరు 5 (వయసు 71)
లింగాపూర్, కరీంనగర్ జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి మాధవి
సంతానం 1 కొడుకు, 1 కూతురు

సిరిసిల్ల రాజయ్య వరంగల్లు (ఎస్.సి) పార్లమెంటరీ నియోజిక వర్గం నుండి 15వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు.

ఆయనను 2024 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.[1]

బాల్యం

[మార్చు]

రాజయ్య 1953 అక్టోబరు 5 న కరీంనగర్ జిల్లాలోని లింగాపుర్ గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: శ్రీమతి శాంతమ్మ, శ్రీ బక్కయ్య.[2]

చదువు

[మార్చు]

వీరు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయంలో వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు.

కుటుంబము

[మార్చు]

రాజయ్య 9., మార్చి 1974 లో శ్రీమతి మాధవిని వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్థానము

[మార్చు]

రాజయ్య 2009 లో 15వ లోక్ సభకు ఎన్నికయ్యారు.

అభిరుచులు

[మార్చు]

ప్రజా సేవ, ప్రజలతో మమేకము కావడము, పాటలు వినడము, ఆట పాటలంటే వీరికి ఇష్టమైన విషయాలు.

హత్య కేసు

[మార్చు]

రాజయ్య, కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు ఏడేళ్ళ అభినవ్, మూడేళ్ళ కవలలు అయోన్, శ్రీయోన్‌ల మరణం కేసులో అరెస్టయ్యాడు. 2015 నవంబరు 4 తెల్లవారు జామున ఈ ముగ్గురూ రాజయ్య ఇంట్లో మంటల్లో కాలి మరణించారు. వీరి మృతిపై అనుమానాలున్నాయని సారిక తల్లి లలిత, చెల్లి అర్చనలు తెలిపారు.[3][4] సారికది అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ రాజయ్య కుటుంబీకులందరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.[5]

ఈ కేసులో సిరిసిల్ల రాజ‌య్య‌తో పాటు ఆయ‌న కుమారుడు అనిల్‌, భార్య మాధ‌వి నిందితులు. కాగా సుదీర్ఘ విచారణ అనంతరం 2022 మార్చి 22న వరంగల్‌ కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది.[6]

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (16 February 2024). "తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-01. Retrieved 2014-01-21.
  3. డబ్బు కోసమే సారికను హత్య చేశారన్న సారిక తల్లి లలిత (సాక్షి - 4 నవంబరు 2015)
  4. మా అక్క ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదు అని తెలిపిన సారిక సోదరి అర్చన (సాక్షి - 04 నవంబరు 2015)
  5. రాజయ్య కుటుంబ సభ్యుల అరెస్టు (గ్రేట్ ఆంధ్రా - 04 నవంబరు 2015)
  6. "Siricilla Rajaiah: సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట". Sakshi. 2022-03-22. Retrieved 2022-03-22.