సుధాకర్ (నటుడు)
సుధాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకు శుభలేఖ సుధాకర్ చూడండి.
| సుధాకర్ బేతా | |
సుధాకర్ (బుసాని పృథ్వీరాజ్ రేఖాచిత్రం) |
|
| జన్మ నామం | సుధాకర్ బేతా |
| జననం | ఫిబ్రవరి 1 1956 (వయసు 57) |
| ప్రముఖ పాత్రలు | యముడికి మొగుడు శుభాకాంక్షలు స్నేహితులు |
సుధాకర్ ప్రముఖ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత. ఇతడు ప్రధాన నటుడిగాను,హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.
విషయ సూచిక |
జీవిత విశేషాలు [మార్చు]
సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టాడు.[1] బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. ఏలూరు లో, మరియు గుంటూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు. తదనంతరం ప్రముఖ నటుడు చిరంజీవి, హరిప్రసాద్ మరియు నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉన్నపుడు ఒకసారి అప్పటికి ఉప దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజా ను కలవడం ఆయన సుధాకరును కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది, దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి రాధికతో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.[2]
తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు ఊరికిచ్చిన మాట, భోగి మంటలు.
పురస్కారాలు [మార్చు]
- శుభాకాంక్షలు సినిమాకు గాను నంది పురస్కారము వచ్చింది.
- స్నేహితులు సినిమాకు మరొక నంది నంది పురస్కారము వచ్చింది.
నిర్మాతగా [మార్చు]
సుధాకర్ మూడు చిత్రాలు నిర్మించాడు. అవి
ఇతర విశేషాలు [మార్చు]
- సుధాకర్ ప్రముఖ నటుడు చిరంజీవికి మిత్రుడు.చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచీ వీరిద్దరికీ పరిచయం.
- ఇతడు చిరంజీవి కలసి యముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణ మూర్తితో కలసి నిర్మించారు.
పేరు పడ్డ సంభాషణలు [మార్చు]
- పితుహు (యముడికి మొగుడు)
- బిళ్ళలు తిప్పుతున్నావా కిట్టూ (అల్లరి ప్రేమికుడు)
సుధాకర్ నటించిన కొన్ని తెలుగు చిత్రాలు [మార్చు]
- పూల్స్
- ఫ్యామిలీ సర్కస్
- చిన్నా (2001)
- పోస్ట్ మాన్
- యమజాతకుడు
- ఇద్దరు మిత్రులు (చిరంజీవి)
- శుభాకాంక్షలు
- పెళ్ళికానుక
- హిట్లర్
- రాజా
- గోకులంలో సీత
- సుస్వాగతం
- లిటిల్ సోల్జర్స్
- శుభమస్తు
- ముగ్గురు మొనగాళ్ళు (చిరంజీవి)
- అల్లరి ప్రేమికుడు
- ఆశయం
- ఆహ్వానం
- అల్లరి పిడుగు
- మెకానిక్ అల్లుడు
- గోల్మాల్ గోవింద
- పచ్చని సంసారం
- పెద్దరికం
- యముడికి మొగుడు
- అత్తకు యముడూ అమ్మాయికి మొగుడు
- సూర్యవంశం
- సంక్రాంతి