సూరంపూడి శివకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూరంపూడి శివకుమార్ ఐటీసీ సంస్థ ఆగ్రీ బిజినెస్ విభాగానికి సీఈవో, ఐటీసీ టెక్నో అగ్రీ సైన్సెస్ లిమిటెడ్ కు ఛైర్మన్, ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ కు వైస్ ఛైర్మన్. వ్యవసాయోత్పత్తుల అమ్మకంలో వ్యవసాయ దారులు అంతర్జాలంలో సంస్థలతో బేరమాడి, అమ్మే ఇ-చౌపల్ విధానాన్ని అభివృద్ధి చేసి, అమలులోకి తీసుకువచ్చారు.[1] 90వ దశకంలోనే వ్యవసాయదారులు నేరుగా సంస్థతో బేరమాడి తమ ఉత్పత్తులు అమ్మేందుకు, వ్యవసాయ పద్ధతులు మెరుగుపరచుకునేలా అవగాహన పెంపొందించుకునేందుకు అంతర్జాలంతో అనుసంధానం చేసేందుకు ఇ-చౌపల్ ప్రయత్నించింది. కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (సీజీఐఎఆర్) ప్రైవేట్ సెక్టార్ కమిటీకి, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఎన్.ఎ.ఎ.ఆర్.ఎం.) పరిశోధన సలహా కమిటీలో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. భారత ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరిచిన మేనేజ్మెంట్ కమిటీలు, టాస్క్ ఫోర్సులు, సలహా మండళ్లలో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు.[2]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

శివకుమార్ బి.ఎ. పూర్తి చేశాకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్ మెంట్, ఆనంద్(ఐఆర్ఎంఎ)లో రూరల్ మేనేజ్మెంట్ కోర్సును అభ్యసించారు.[3] ఐఆర్ఎంఎ 1981-83 బ్యాచ్ లో టాపర్ గా నిలిచారు.[1]

ఉద్యోగ జీవితం[మార్చు]

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాకా శివకుమార్ గుజరాత్ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ (GROFED)లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. గ్రోఫెడ్ ను ఎన్.డి.డి.బి. సంస్థ ప్రోత్సహించింది, దీని లక్ష్యం నూనె గింజలు, నూనెల రంగాన్ని పున: సృజించడం, ఆనంద్ తరహా సహకార వ్యవస్థను దీనిలోనూ తీసుకురావడం. దాదాపు ఆరు సంవత్సరాల పాటు సంస్థలో పనిచేశాకా ఆనంద్ తరహా సహకార విప్లవం నూనెల రంగంలో సాధ్యం కావడంలేదని, పాల ఉత్పత్తి రంగంలోనూ, నూనెల రంగంలోనూ మార్కెట్ విషయంలో ఉన్న తేడాలు దీనికి కారణమని ఆయన అర్థం చేసుకున్నారు.[4]
1989లో ఆయన ఐటీసీ సంస్థలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా 1994లో ఆయన సుప్రసిద్ధ ఇ-చౌపల్ వ్యవస్థను ప్రారంభించారు.

ఇ-చౌపల్[మార్చు]

ప్రధాన వ్యాసం:ఇ-చౌపల్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Corporate Management Committee". ITC portal. ITC. Retrieved 15 May 2016.
  2. "Syngenta Foundation For Sustainable Agriculture (SFSA) — BIOS4". www.syngentafoundation.org.[permanent dead link]
  3. "executive profile:Surampudi sivakumar". Bloomberg business. Retrieved 15 May 2016.
  4. Surampudi, Sivakumar. "Dr Verghese Kurien - Inspiration to a Rural Manager". Shiv's random reflections. Retrieved 15 May 2016.