సెహ్రా
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ముస్లింలు వివాహ సమయంలో పెళ్లికుమారునికి వేసే పూల ముసుగును సెహ్రా అంటారు.పెళ్లికి ముందు జరిగే ఊరేగింపులో పెళ్లి కుమారునికి దీనిని ధరింపజేసి గుర్రంపై లేదా కారు, జీపు, ఎద్దులబండి, గుర్రంబండి, సైకిలు వంటి వాహనాలపై ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.సాధారణంగా పెళ్లి కొడుకు ఇంటి నుంచి లేదా విడిది ఇంటి నుంచి సెహ్రా ధరించిన పెళ్ళికొడుకుని ఊరేగింపుగా పెళ్లికూతురు ఇంటి వద్దకు లేదా పెండ్లి మండపం వద్దకు తీసుకువెళ్లతారు. ఈ సెహ్రాను మల్లె పూలతో లేదా తెల్ల గన్నేరు పూలతో లేదా ఇతర కొన్ని రకాల తెల్లని పూలతో తయారు చేస్తారు.
నమ్మకం [మార్చు]
పెళ్లి సమయంలో కొన్ని దుష్ట శక్తులు పెళ్లి కుమారుని ఆవహిస్తాయని అందువలన సెహ్రాను ధరిస్తే అవి దూరమవుతాయని ముస్లిం యొక్క నమ్మకం.[ఆధారం కోరబడినది]