సోమశేఖరస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమశేఖరస్వామి దేవాలయం
పేరు
ప్రధాన పేరు :సోమశేఖరస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:బాపట్ల జిల్లా
ప్రదేశం:కోటిపల్లి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సోమశేఖరస్వామి (శివుడు)
ప్రధాన దేవత:సత్యజ్ఞాన ప్రసూనాంబ
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ

సోమశేఖరస్వామి దేవాలయం బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం కోటిపల్లి గ్రామంలో నెలకొని ఉంది. ఇది గుంటూరు జిల్లా ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటి[1].

స్థలపురాణం[మార్చు]

సా.శ.1770లో రాచూరు జమీందారు రాజా జగ్గన్నారావు మాణిక్యాలరావు విహారయాత్రకు వెళ్లి కోటిపల్లి మీదుగా తిరిగి వస్తుండగా "నన్ను చూడకుండానే వెళ్ళుచున్నావా" అనే మాటలు అతని చెవులకు సోకాయట. వెంటనే ఆ జమీందారు అక్కడ దిగి అటూ ఇటూ చూడగా ఒక పుట్ట కనిపించింది. దానిపై కొన్ని పుష్పాలు కూడా కనిపించాయి. వెంటనే అతడు తన నగరానికి వెళ్లి తన మంత్రి, పురోహితులతో ఈ విషయం గురించి వివరించగా వారు ఆ పుట్టలో శివలింగం ఉన్నట్లు తెలిపారట. వెంటనే ఆ జమీందారు అక్కడి స్థలాన్ని పరిశీలించి, ఆగమ, వేద శాస్త్రాల ప్రకారం శివలింగాన్ని వెలికి తీయించి ఒక శుభముహూర్తంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిపించాడు. తరువాత స్వామివారికి గర్భాలయం, ముఖమంటపం మొదలైనవి కట్టించి వైభవోపేతంగా ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహించాడు. పావనకృష్ణానదిలో స్నానం చేసి ఈ దేవుని సందర్శిస్తే సర్వపాపాలు నశిస్తాయని ఇక్కడి భక్తుల నమ్మకం.

విశేషాలు[మార్చు]

  • ఈ ఆలయం కృష్ణానదీ తీరంలో నెలకొని ఉంది.
  • దోనేపూడి గ్రామానికి 1.5 కి.మీల దూరంలో తెనాలి - రేపల్లె రోడ్డు మార్గంలో ఈ దేవాలయం ఉంది.
  • సమీప రైల్వేస్టేషన్ భట్టిప్రోలు.
  • ఈ ఆలయ ప్రాంగణంలో సత్యజ్ఞానప్రసూనాంబ అమ్మవారు, పాపవిమోచన స్వామి, వినాయక, నవగ్రహాలు కొలువై ఉన్నారు.
  • ఈ ఆలయానికి చాలాకాలం రాచూరు జమీందారీ వంశీకులు ధర్మకర్తలుగా వ్యవహరించారు. తరువాత ఈ ఆలయ నిర్వహణ దేవాదాయ ధర్మాదాయశాఖ చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది.
  • ఈ ఆలయానికి గాలిగోపురము, యజ్ఞశాల, వాహనశాల, కళ్యాణమంటపాలు ఉన్నాయి. స్వామివారికి నంది వాహనము, చలవచప్రములు ఉన్నాయి.
  • ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి, దేవీనవరాత్రులు, కార్తీక మాసం, ముక్కోటి ఏకాదశి, సంవత్సరాది పండుగలలో విశేషపూజలు జరుగుతాయి.

మూలాలు[మార్చు]

  1. పి.వి.ఆర్. అప్పారావు (18 January 1981). "శ్రీ సోమశేఖరస్వామి వారి దేవస్థానము కోటిపల్లి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 284. Retrieved 4 February 2018.[permanent dead link]