సౌండ్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సౌండ్ పార్టీ
దర్శకత్వంసంజ‌య్ శేరి
స్క్రీన్ ప్లేసంజ‌య్ శేరి
కథసంజ‌య్ శేరి
నిర్మాత
  • రవి పోలిశెట్టి
  • మహేంద్ర గజేంద్ర
  • శ్రీ శ్యామ్ గజేంద్ర
తారాగణం
ఛాయాగ్రహణంజె.శ్రీనివాస్‌రెడ్డి
కూర్పుఅవినాష్ జి
సంగీతంమోహిత్‌ రెహమానిక్‌
నిర్మాణ
సంస్థ
ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీ
2023 నవంబరు 24 (2023-11-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

సౌండ్ పార్టీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జయ శంకర్ సమర్పణలో ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమాకు సంజ‌య్ శేరి దర్శకత్వం వహించాడు. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్, శివన్నారాయణ, ఆలీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 16న చేసి[1] సినిమాను నవంబర్ 24న విడుదల చేశారు.[2]

కథ[మార్చు]

డాలర్ కుమార్ (వీజే సన్నీ), కుబేర్ కుమార్ (అప్పాజీ శివన్నారాయణ) మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు. వీరిద్దరు సులభంగా కోటీశ్వరులు కావాలని, తరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించాలని కలలు కంటుంటారు. అలా ఈజీ మనీ కోసం అనేక రకాల వ్యాపారాలు చేసి నష్టపోవడమే కాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారు. దాని నుంచి బయట పడేందుకు అడ్డ దారులు తొక్కుతారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జోడెద్దుల వరప్రసాద్ (పృథ్వీరాజ్) తన కొడుకుని (భువన్ సాలూరు)ని కాపాడుకోడానికి డబ్బు ఆశ చూపించి కుబేర్, డాలర్ కుమార్‌లను జైలుకి పంపిస్తాడు.

తండ్రీకొడుకులకు జైలుకు వెళ్లిన తర్వాత ఎదురైన సమస్యలు ఏంటీ ? ఎమ్మెల్యే వర ప్రసాద్ వారిని మోసం చేయడానికి గల కారణాలు ఏంటీ? తండ్రికొడుకులు ఆ నేరం నుంచి బయట పడ్డారా? వాళ్లు కలలు కన్నట్లుగా కోటీశ్వరులు అయ్యారా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్
  • నిర్మాత: రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజ‌య్ శేరి
  • సంగీతం: మోహిత్‌ రెహమానిక్‌
  • సినిమాటోగ్రఫీ: జె.శ్రీనివాస్‌రెడ్డి
  • ఎడిటర్: అవినాష్ జి

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (17 November 2023). "'సౌండ్ పార్టీ' మూవీ థియేట్రికల్ ట్రైలర్". Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
  2. News18 తెలుగు (14 November 2023). "ఈ నెల 24న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలవుతున్న `సౌండ్ పార్టి` మూవీ." Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (24 November 2023). "'సౌండ్‌ పార్టీ' మూవీ రివ్యూ". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.