స్టీఫెన్ హాకింగ్
NASA StarChild image of Stephen Hawking |
|
| జననం | జనవరి 8 1942 (వయసు 71) Oxford, England |
|---|---|
| నివాసం | ఇంగ్లాండు |
| జాతీయత | బ్రిటిష్ |
| మాతృ సంస్థ | University of Oxford University of Cambridge |
| పర్యవేక్షకుడు | Dennis Sciama |
| ప్రముఖ విద్యార్ధులు | Bruce Allen Fay Dowker Malcolm Perry Bernard Carr Gary Gibbons Raymond Laflamme |
| ప్రాముఖ్యత | కాలబిలాలు Theoretical cosmology Quantum gravity |
స్టీఫెన్ విలియం హాకింగ్ (ఆంగ్లం: Stephen Hawking) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.
కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు.మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...
విషయ సూచిక |
జీవిత ఘట్టాలు [మార్చు]
అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది. అప్పుడే అంటే 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించారు. ఆయన తండ్రి వృత్తి రిత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలొ లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించారు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చారు. తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చారు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించారు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరిక్ష రాశారు. అందులో సఫలీకృతుడు కాగలిగినా... భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశారు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగారు. కాస్మాలజి, జనరల్ రిలేటివిటీ పరిశోధనల కోసం ఆక్స్ ఫర్ద్ కి వెళ్ళారు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా... కనిసం బూట్ల లేసు కట్టుకుందామన్నా... స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్ మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది... తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరిక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపె స్టీఫెన్ మరణిస్తాడనే అనుకున్నారంతా... కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్ళి విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లొ నిమగ్నమయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వారు.
వైవాహిక జీవితం [మార్చు]
విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నారు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర్లోనే ఇల్లు తీసుకుని ఉండేవారు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తిసుకున్నారు. అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించారు.
పరిశోధనలు, ఆవిష్కరణలు,అభిప్రాయాలు [మార్చు]
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించారు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించారు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయారు. క్వాంటం థియరి, జనరల్ రిలేటివిటీలను వుపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడీయేషన్ వెలువరిస్తాయని కనుగోన్నారు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించారు.ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యులxbvbdng వుండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు.అది అమ్మకాల్లో సృష్టించిన రికార్దు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ... కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
- "మరణం తర్వాత జీవితం లేదు.స్వర్గం అనేదొక కట్టుకథ.మరణం తర్వాత జీవితం,స్వర్గం నరకం వంటివేమీ లేవు.ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు.మనిషి మెదడు కూడా కంప్యూటర్ వంటిదే,విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది.ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు.కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి.మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు.నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి"(ఈనాడు17.5.2011).
పుస్తకాలు [మార్చు]
Technical [మార్చు]
- Singularities in Collapsing Stars and Expanding Universes with Dennis William Sciama, 1969 Comments on Astrophysics and Space Physics Vol 1 #1
- The Nature of Space and Time with Roger Penrose, foreword by Michael Atiyah, New Jersey: Princeton University Press, 1996, ISBN 0-691-05084-8
- The Large Scale Structure of Spacetime with George Ellis, 1973 ISBN 0-521-09906-4
- The Large, the Small, and the Human Mind, (with Abner Shimony, Nancy Cartwright, and Roger Penrose), Cambridge University Press, 1997, ISBN 0-521-56330-5 (hardback), ISBN 0-521-65538-2 (paperback), Canto edition: ISBN 0-521-78572-3
- Information Loss in Black Holes, Cambridge University Press, 2005
- God Created the Integers: The Mathematical Breakthroughs That Changed History, Running Press, 2005 ISBN 0-7624-1922-9
Popular [మార్చు]
- A Brief History of Time, (Bantam Press 1988) ISBN 0-553-05340-X
- Black Holes and Baby Universes and Other Essays, (Bantam Books 1993) ISBN 0-553-37411-7
- The Universe in a Nutshell, (Bantam Press 2001) ISBN 0-553-80202-X
- On The Shoulders of Giants. The Great Works of Physics and Astronomy, (Running Press 2002) ISBN 0-7624-1698-X
- A Briefer History of Time, (Bantam Books 2005) ISBN 0-553-80436-7
Footnote: On Hawking’s website, he denounces the unauthorised publication of The Theory of Everything and asks consumers to be aware that he was not involved in its creation.
Children's Fiction [మార్చు]
- George's Secret Key to the Universe, (Random House, 2007) ISBN 978-0-385-61270-8
- George and the Cosmic Treasure Hunt, (Random House, 2009)
Films and series [మార్చు]
- A Brief History of Time (film)
- Stephen Hawking's Universe
- Horizon: The Hawking Paradox[1]
- Masters of Science Fiction
- Stephen Hawking: Master of the Universe
A list of Hawking’s publications through the year 2002 is available on his website.
డిగ్రీలు - పదవులు - పురస్కారాలు [మార్చు]
- 1975 ఎడింటంగ్ మెడల్
- 1976 రాయల్ సొసైటి హ్యుగ్స్ మెడల్
- 1979 అల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్
- 1982 ఆర్డర్ ఆఫ్ బ్రీటీష్ ఎఒపైర్ (కమాండర్)
- 1985 రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ బంగారు పతకం
- 1986 పొంటిఫిషియల్ అకాడమి ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం
- 1988 భౌతిక శాస్త్రంలో అంతర్జాతీయ బహుమతి
- 1989 కన్ కర్డ్ లొ ఆస్ట్రియా ప్రిన్స్ అవార్డ్
- 1989 కంపానియన్ ఆఫ్ ఆనర్
- 1999 అమెరికా భౌతిక శాస్త్ర సమితి వారి జూలియస్ ఎడ్గర్ లిలెన్ ఫెల్ద్ ప్రైజ్
- 2003 కేస్ వెస్ట్రెన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వారి మైకెల్ సన్ మోర్లీ అవార్డ్
- 2006 రాయల్ సొసైటీ కాప్లి మెడల్
వ్యాధి గురించి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ The Hawking Paradox, Internet Movie Database, 2005, http://www.imdb.com/title/tt0819995/, retrieved 2008-08-29