స్వప్న వాసవదత్తం

వికీపీడియా నుండి

స్వప్న వాసవదత్తం లొ నాయకుడు ఉదయనుడు. నాయిక వాసవదత్త. వాసవదత్తకూ ఉదయనునికీ వివాహమయినా కొన్ని రాజకీయకారణాలవల్ల ఉదయనునికి మరొ రాకుమారితో వివాహం అవసరమవుతుంది. మంత్రి యుగంధరుని ప్రణాళిక మేరకు వాసవదత్త అగ్ని ప్రమాదంలో మరణించినట్టుగ నటించి ఉదయనుని అంత:పురంలోనే ఉదయనునికి కూడా తెలియకుండా అగ్న్యాతంగా ఉంటుంది. ఒకనాడు వాసవదత్త విరహంతో బాధ పడుతున్న ఉదయనుడు ఉద్యానవనంలో నిద్రిస్తూ వాసవదత్త వచ్చినట్టు కలగంటూ ఉంటాడు. ఆ సమయంలొ నిజంగానే వాసవదత్త అక్కడికి వస్తుంది. నిదరలో పలవరిస్తున్న ఉదయనుడు వాసవదత్త చెయ్యి పట్టుకుంటాడు......


ఇటువంటి నాటకీయమయిన పరిణామాలతో ఎంతో ఉత్కంఠతో సాగి చివరకు సుఖాంతమవుతుంది. కలలో కనిపించిన వాసవదత్త చివరికి నిజంగానే ప్రత్యక్షం కావడమే కధాంశం కనుక ఈ నాటకానికి స్వప్న వాసవదత్తం అని పేరు వచ్చింది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె