హెపటైటిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాండీస్ వచ్చిన వ్యక్తి కళ్ళు

హెపటైటిస్ (Hepatitis) అనగా కాలేయానికి చెందిన వ్యాధి. ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీనిలో వైరస్ వలna కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) అంటారు.

వైరల్ హెపటైటిస్[మార్చు]

హెపటైటిస్-ఎ[మార్చు]

హెపటైటిస్-ఎ,( ఇన్ఫెక్షస్ హెపటైటిస్) హెపటైటిస్-ఎ వైరస్ ద్వారా వచ్చే లివర్ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి యేటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగలక్షణాలు మొదలయ్యే వరకు ( ఇంక్యుబేషన్ పీరియడ్) సాధారణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. హెపటైటిస్-ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

వ్యాధి జననం[మార్చు]

వ్యాధికారక క్రిమి గొంతు లేక ప్రేవులోని కణజాలాన్ని చొచ్చుకొని, రక్తం ద్వారా లివర్‌కు చేరి, అక్కడ అభివృద్ధి చెందుతుంది.అద్దంకి

ప్రివలెన్స్[మార్చు]

వ్యాధికారక క్రిములు రోగి మలంలో కనబడతాయి. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలను సందర్శించే వారికి, రోగితో సంభోగించిన వారికి, రోగి వాడిన సూదులు, సిరెంజిలు వాడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

హెపటైటిస్-బి[మార్చు]

హెపటైటిస్-సి[మార్చు]

హెపటైటిస్-జి[మార్చు]

హెపటైటిస్‌-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం జరుపబడుతుంది.[1]

మూలాలు[మార్చు]

  1. ప్రజాశక్తి, ఫీచర్స్ (26 July 2016). "కామెర్లతో కాలేయానికి కష్టం!". డాక్టర్‌ ఎం.వి.రమణయ్య. Archived from the original on 27 జూలై 2016. Retrieved 28 July 2019.