అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్

వికీపీడియా నుండి
((NH4)2(PtCl6) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్
Ammonium hexachloroplatinate
Ammonium hexachloroplatinate
పేర్లు
IUPAC నామము
Ammonium hexachloroplatinate(IV)
ఇతర పేర్లు
ammonium chloroplatinate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [16919-58-7]
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:59604
SMILES [NH4+].[NH4+].Cl[Pt-2](Cl)(Cl)(Cl)(Cl)Cl
  • InChI=1/6ClH.2H3N.Pt/h6*1H;2*1H3;/q;;;;;;;;+4/p-4/rCl6Pt.2H3N/c1-7(2,3,4,5)6;;/h;2*1H3/q-2;;/p+2

ధర్మములు
(NH4)2PtCl6
మోలార్ ద్రవ్యరాశి 443.87 g/mol
స్వరూపం yellow crystals
వాసన odorless
సాంద్రత 3.065 g/cm3
ద్రవీభవన స్థానం 380 °C (716 °F; 653 K) decomposes
0.289 g/100ml (0 °C)
0.7 g/100ml (15 °C)[1]
0.499 g/100ml (20 °C)
3.36 g/100ml (100 °C)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ఒక రసాయన సంయోగ పదార్థం. అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. ఈ సంయోగ పదార్థాన్ని అమ్మోనియం క్లోరోప్లాటినేట్ అనికూడా వ్యవహరిస్తారు. ఈ రసాయన పదార్థం యొక్క రసాయన సంకేత పదం (NH4)2[PtCl6]. ఇది నీటిలో పసుపురంగు ద్రావణాన్ని ఏర్పరచును. ఒక మొలారిటి అమ్మోనియం క్లోరైడ్(NH4Cl) లో అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ యొక్క ద్రవణీయత కేవలం 0.0028 గ్రాములు/100 మి.లీ. ఇది ఆర్ద్రతాకర్షణ లేని రసాయన సంయోగపదార్థం.

భౌతిక ధర్మాలు[మార్చు]

భౌతిక రూపం[మార్చు]

అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ వాసన లేని ,పసుపురంగులో ఉన్న స్పటికాకృతికల్గి ఘనస్థితిలో ఉండు రసాయన సంయోగ పదార్థం. అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ యొక్క అణుభారం 443.87 గ్రాములు/మోల్,[2] అర్ద్రాతాకర్షణ కల్గిన రసాయన సంయోగ పదార్థం.[3]

సాంద్రత[మార్చు]

అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ రసాయన సంయోగ పదార్థం సాంద్రత 3.065(3.07) గ్రాములు/సెం.మీ3[3]

ద్రవీభవన ఉషోగ్రత[మార్చు]

అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ రసాయన సంయోగపదార్థం యొక్క ద్రవీభవన స్థానం 380 °C (716 °F; 653K),ఈ ఉష్ణోగ్రత దగ్గర అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ వియోగం పొందును.

ద్రావణీయత[మార్చు]

నీటిలో అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ద్రావణీయత కల్గినను అది, పరిమిత స్వల్ప ప్రమాణంలో మాత్రమే కల్గి ఉన్నది. 100 మి.లీ పరిమాణం ఉన్న నీటిలో 0 °C వద్ద 0.289గ్రాములు,15 °C వద్ద 0.7 గ్రాములు,20 °C దగ్గర 0.499గ్రాములు,100 °C వద్ద 3.36 గ్రాములు కరుగును.

రసాయన చర్యలు[మార్చు]

హైడ్రోజన్ వాయు ప్రవాహం (stream of hydrogen )లో 200 °C వద్ద అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ను వేడి చేయడం వలన ప్లాటినం స్పాంజి ఏర్పడును. దీనిని క్లోరిన్ వాయువుతో చర్య నొందించడం వలన H2PtCl6 ఏర్పడును.

ఉత్పత్తి[మార్చు]

అమ్మోనియం హెక్సాక్లోరో ప్లాటినేట్ సంయోగ పదార్థం టెట్రాహెడ్రల్ అమ్మోనియం కేటాయానులు,ఆక్టాహెడ్రల్[PtCl6]2− అనయానులను కల్గి ఉండును. హెక్సాక్లోరోప్లాటినిక్ ఆమ్లద్రవంతో అమ్మోనియం లవణాన్ని చర్య నొందించడం ద్వారా మొత్తాన్ని చూర్ణంవంటి అమ్మోనియం హెక్సాక్లోరో ప్లాటినేట్‌ను అవక్షేపంగా పొందటం జరుగును. ఈ సంక్లిష్ట సంయోగ పదార్థం అతితక్కువ/అధమ ద్రావణియత కల్గి ఉన్నందున, ఖనిజాలనుండి, రిసైకిల్డ్ శేషపదార్థాల నుండి ప్లాటినంను వేరుచేయుటకు ఈ విధానాన్ని అనుసరిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ను ప్లాటినం ప్లేటింగు లో ఉపయోగిస్తారు.అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్,రసాయనంCu(OAc)2మరియు హైడ్రోజన్ సల్ఫైడ్(H>2S తో చర్య వలనCu2PtIIPt3IVS8ను ఉత్పత్తి చేయును.ఈఈ ఉత్పాదికాన్ని డయా మాగ్నెటిక్ పదార్థాలలో,సెమి కండక్టరులలో ఉపయోగిస్తారు.[4]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "ammonium hexachloroplatinate(IV)". Chemister.ru. 2007-03-19. Retrieved 2014-06-03.
  2. "Ammonium Hexachloroplatinate(IV)". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2016-04-06.
  3. 3.0 3.1 "Ammonium chloroplatinate". chemicalbook.com. Retrieved 2016-04-06.
  4. "Ammonium hexachloroplatinate(IV)". sigmaaldrich.com. Retrieved 2016-04-06.