35వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
35వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented onడిసెంబరు 9, 2004
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ది బ్యూటిఫుల్ సిటీ"

35వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2004 నవంబరు 29 నుండి డిసెంబరు 9 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2] గోవాలోని శాశ్వత వేదికలో జరిగిన మొదటి చిత్రోత్సవం ఇది.[3] హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రదర్శన జరిగే "బీచ్ స్క్రీనింగ్" విభాగం ఈ చిత్రోత్సవంతోనే మొదటిసారి స్థాపించబడింది.[4][5]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[6][7] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[8]

విజేతలు[మార్చు]

  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "అస్గర్ ఫర్హాది" దర్శకత్వం వహించిన "ది బ్యూటిఫుల్ సిటీ" (ఇరానియన్ చిత్రం)
  • ప్రత్యేక జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్: "ది బ్యూటిఫుల్ సిటీ " సినిమాలో నటించిన "ఫరామార్జ్ ఘారిబియన్"
  • మోస్ట్ ప్రామిసింగ్ ఆసియా దర్శకుడికి సిల్వర్ పీకాక్ అవార్డు: "బ్యూటిఫుల్ బాక్సర్" థాయ్ సినిమా దర్శకుడు "ఎకాచై యుక్రోంగ్తం"
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్: "జెన్నడి సిడోరోవ్" దర్శకత్వం వహించిన "ఓల్డ్ ఉమెన్" బై (రష్యన్ చిత్రం)[9]

అధికారిక ఎంపికలు[మార్చు]

ప్రత్యేక ప్రదర్శనలు[మార్చు]

ప్రారంభ సినిమా[మార్చు]

ముగింపు సినిమా[మార్చు]

  • "ఆలివర్ స్టోన్" దర్శకత్వం వహించిన "అలెగ్జాండర్ "

మూలాలు[మార్చు]

  1. "National : Colourful start to film festival in Goa". The Hindu. 2004-11-30. Retrieved 2021-07-01.
  2. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2018-03-19. Retrieved 2021-07-01.
  3. "35th International Film Festival of India 2004". Archived from the original on 2018-03-19. Retrieved 2021-07-01.
  4. "Beach Screening Makes Its Debut with Mission Impossible at the 35th IFFI Goa 2004". businesswireindia.com. Archived from the original on 2018-03-19. Retrieved 2021-07-01.
  5. blanj. "The Hindu Business Line : Finally, a permanent address!". www.thehindubusinessline.com. Retrieved 2021-07-01.
  6. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  7. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  8. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
  9. "English Releases". Retrieved 2021-07-01.

బయటి లింకులు[మార్చు]