GAFAM

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

GAFAM అనేది వెబ్ దిగ్గజ సంస్థలైన గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ల సంక్షిప్త రూపం. ఇవి మార్కెట్లో ఆధిపత్యం వహిస్తున్న ఐదు ప్రధాన అమెరికన్ సంస్థలు (20 వ శతాబ్దం చివరి పాదంలోను, 21 వ శతాబ్ద ప్రారంభంలోనూ వీటిని స్థాపించారు). కొన్నిసార్లు బిగ్ ఫైవ్ అనీ, " ది ఫైవ్ " అనీ కూడా పిలుస్తారు.

కొన్ని రంగాలలో ఈ ఐదు కంపెనీలు ప్రత్యక్ష పోటీలో ఉన్నప్పటికీ, ఇవి సాధారణంగా వేర్వేరు ఉత్పత్తులు లేదా సేవలను అందిస్తాయి, అయినప్పటికీ ఇవన్నీ కొన్ని లక్షణాలను ఉమ్మడిగా కలిగి ఉన్నాయి, అందుకే వీటిని ఒకే సంక్షిప్తనామం కింద తీసుకురావడానికి అర్హత కలిగినవి. ఇవి ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంపై ప్రభావం చూపుతాయి. ఎప్పుడూ ఎదో ఒక పన్ను విమర్శలు లేదా కోర్టు కేసుల్లో వీటి పేరు తరచూ వినిపిస్తుంది. వాటి కార్పోరేట్ శక్తులని వాడి దుష్టపనులకు పాల్పడడం, అంతర్జాలం వినియోగదారుల గోప్యతను గౌరవించడంలో తప్పిదాలను చేయడం లాంటివి చేస్తుంటాయి.



"https://te.wikipedia.org/w/index.php?title=GAFAM&oldid=4032190" నుండి వెలికితీశారు