వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)

వికీపీడియా నుండి
(GST నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

G

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థ. దాన్ని 101వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు.

జీఎస్టీ అన్నది భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు, సేవల తయారీ, అమ్మకం, వినియోగాలపై విధించనున్న సమగ్రమైన పరోక్ష పన్ను.

ఈ పద్ధతిలో జీఎస్టీ-నమోదిత వ్యాపారాలు తమ వాణిజ్య వ్యవహారాల్లో భాగంగా కొనుగోలు చేసే సాధారణ వస్తువులు, సేవలపై జీఎస్టీ విలువ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు. వస్తువులు, సేవలపై పన్ను విధించే నిర్వహణ బాధ్యత సాధారణంగా ఏకైక అధికారి వద్ద ఉంటుంది.[1] ఎగుమతులు, SEZ అమ్మకాలు జీరో-రేటెడ్ సప్లైలుగా పరిగణిస్తారు, దిగుమతులపై జీఎస్టీ కిందకు రాని కస్టమ్ డ్యూటీనీ, దానితో పాటు దేశీయ వస్తువులు, సేవలకు పడేలాంటి జీఎస్టీని విధిస్తారు.

భారతదేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని సంస్కరించడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టడం ప్రాముఖ్యత కలిగిన పరిణామం.  పలు కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకైక పన్నుగా [2] రూపొందించడం వల్ల  రెండు మార్లు ఒకే పన్ను పడడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది, ఒకే జాతీయ సాధారణ మార్కెట్ సాధ్యమవుతుంది. పన్నులోని సరళత వల్ల పరిపాలన, అమలు సులభం అవుతున్నాయి. వినియోగదారుల కోణం నుంచి చూస్తే వస్తువుల మీద మొత్తం పన్ను భారం అంచనాల మేరకు 25 నుంచి 30 శాతం వరకూ తగ్గనుండడం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాష్ట్ర సరిహద్దుల్లో పన్ను చెల్లింపుల గురించి గంటల పాటు నిలుపుదల లేకుండా రవాణా సాగడం, పెద్ద ఎత్తున రాతకోతలు తగ్గుదల వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

వస్తు సేవల పన్ను (GST) వల్ల కలిగే ప్రయోజనాలు (Advantages):

1. పన్నుల సరళీకరణ వలన ధరలు తగ్గే వీలున్నది. పేద రాష్ట్రాలు లాభపడుతాయి. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం ఇది వరకు ఎక్కువగా ధనిక రాష్ట్రాలకే పోయేది, ఎందుకంటే ఆ రాష్ట్రాలలో ఎక్కువగా పరిశ్రమలు ఉండటం వలన, కాని ఇప్పుడు ఆ విధంగా జరుగదు.

2.GST అమలు వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగి, ఆర్థిక వృద్ధిరేటు దాదాపు 2% వరకు పెరుగవచ్చునని అంచనా. దేశ ఎగుమతులకు కూడా 10% నుండి 14% వరకు పెరగవచ్చని ఒక అంచనా.

3. పన్నుల ఎగవేత తగ్గుతుంది, చాలా మంది వ్యాపారస్తులు పన్ను పరిధి క్రిందికి వస్తారు GST రిజిస్ట్రేషన్ సులభతరం కానున్నది కావున చాలా మంది వ్యాపారస్తులు ఇండియాలో వ్యాపారం చేయవచ్చు.

4. వినియోగదార్ల వ్యయార్హ ఆదాయం పెరుగుతుంది. అంటే చాలా వరకు వస్తువుల ధరలు తగ్గడం వల్ల వారి ఆదాయంలో పన్నులు పోను ఖర్చు చేయడానికి డబ్బు ఉండే వీలున్నది. అంతే గాక, ఉత్పత్తిదార్లు, ఎగుమతి దార్లు లబ్ధి పొందడమే కాక వారిలో పోటీతత్వం పెరుగుతుంది.

5. పన్నుల్లో పారదర్శకత వల్ల వినియోగదారుడు మోసపోయే వీలు లేదు. అంతే గాక ఇప్పుడు GST అమలు తరువాత వారి కొనుగోళ్ళకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది, వారి పై ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అంతేగాక, అన్ని రాష్ట్రాలలో కూడా “ఒకే పన్ను విధానం” వల్ల అన్ని రాష్ట్రాలు లాభపడుతాయి.

6. పన్నుల వసూళ్లలో లంచగొండితనం తగ్గుతుంది. 7. పన్నుల ఎగవేతకు అవకాశాలు తగ్గడం వల్ల దేశంలో నల్లదనం (Black Money) తగ్గుతుంది.

పన్ను శాతాలు

[మార్చు]

జిఎస్టి కౌన్సిల్ నాలుగు రకాల పన్నులను నెలకొల్పింది, ఇవి 5, 12, 18, 28 శాతం ఉన్నాయి.చాలా విషయాలు జీఎస్టీ (GST) నుండి మినహాయించబడినప్పటికీ,

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-06-26. Retrieved 2017-05-20.
  2. "Which of the existing taxes are proposed to be subsumed under GST? - GST India Forum". Archived from the original on 16 మార్చి 2017. Retrieved 2 April 2017.