ఢిల్లీ మద్యం కుంభకోణం
ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ కుంభకోణం. ఇది 2021 లో ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్ విధానం నుండి ఉద్భవించింది. నుండి 2022 వరకు అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధానం ద్వారా రిటైల్ మద్యం అమ్మకాలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పారు. ప్రైవేట్ రంగాల యజమానులు, వాటాదారులకు అనుకూలంగా ఉంటాయి, లైసెన్సు రుసుమును రద్దు చేయడం/తగ్గించడం, కొత్తగా వచ్చిన సంస్థల కోసం అనేక లైసెన్సులను సృష్టించడం, లంచాలు వంటి ఆరోపణలు వచ్చాయి.[1]
ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందించిన ఎక్సైజ్ పాలసీ 2021–22. దీనిని ఎక్సైజ్, రిటైల్ మద్యం రంగంలో సంస్కరణగా అంచనా వేసింది, తద్వారా ప్రభుత్వ ఆదాయం రూ. 9,500 కోట్లు పెరిగింది. ఈ విధానం ప్రధానంగా రిటైల్ రంగాన్ని తీసివేసి, పెద్దపెద్ద ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించడం చూపడంపై దృష్టి సారించింది. ఈ విధానాన్ని ఢిల్లీ క్యాబినెట్ మంత్రుల బృందం రూపొందించగా ముసాయిదాను 2021 మార్చిలో ప్రభుత్వం ఆమోదించింది.[2][3]
ఢిల్లీ కొత్త మద్యం విధానం 2021 నవంబరు నుంచి అమలులోకి వచ్చింది. ప్రైవేటు సంస్థలకు మద్యం అమ్మే పద్ధతి ప్రారంభించడంతో పాటు, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా ఆ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది.
ఈ తుది ముసాయిదాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం కోసం పంపినప్పుడు, నిర్ధారిత ప్రాంతాలలో కొత్త మద్యం విక్రయదారులు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతితో మాత్రమే తెరవవచ్చనే షరతుతో బిల్లును ఆమోదించారు. 2021 నవంబరులో ఢిల్లీకి చెందిన ఒక ప్రభుత్వ అధికారి, "మొదటిసారిగా అన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం దుకాణాలను మూసివేయబోతున్నారు, పూర్తిగా ప్రైవేట్ వ్యాపార సంస్థలకు బదిలీ చేయబోతున్నారు" అని పేర్కొన్నారు. ఆ తర్వాత కొత్త విధానాన్ని ఉపసంహరించుకుని, ప్రస్తుతానికి పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.[4][5]
ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్, జూలై 8న లెఫ్టినెంట్-గవర్నర్ కార్యాలయానికి ఒక నివేదికను సమర్పించాడు. విధానాన్ని అమలు చెయ్యడంలో విధానపరమైన లోపాలను చూపిస్తూ, లైసెన్సుదారులకు టెండర్ అనంతర ప్రయోజనాలను పొడిగించారని ఆ నివేదికలో పేర్కొన్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు ఆదేశించగా, సీబీఐ కేసు దర్యాప్తు ప్రారంభించింది. మద్యం విధానానంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు 2023 ఫిబ్రవరి 26 న అరెస్ట్ చేశారు.[6]
ఏమిటి ఈ కుంభకోణం
[మార్చు]ఢిల్లీలో 2021 నవంబరు కు ముందు ప్రభుత్వమే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. అందుకోసం రూపొందించిన కొత్త మద్యం విధానం నిబంధనల్లో అవకతవకలు జరిగాయని భాజపా ఆరోపణ చేయగా ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా సిఫారసు చేశారు. దీంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.
కొత్త మద్యం విధానం మీద అవినీతి ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఆ పాలసీని ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రద్దు చేసింది. పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది. కుంభకోణం లోని ప్రధాన అంశాలివి:
- ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్లో నూతన మద్యం విధానాన్ని (పాలసీ) ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం లిక్కర్ రిటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేట్ లైసెన్స్ దారులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ సర్కారు ప్రకటించింది.
- కొత్త పాలసీ కింద మద్యం దుకాణాలను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెల్లవారు జామున 3 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మద్యంపై ప్రైవేట్ లైసెన్స్ దారులు అపరిమితమైన డిస్కౌంట్ ప్రకటించవచ్చు. వినియోదారులకు ఆకర్శణీయమైన ఆఫర్లు ఇవ్వొచ్చు. లిక్కర్ హోం డెలివరీ కూడా చేయ్యొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెం చుకోవడానికి ఉద్దేశించినవే. కొత్త పాలసీ వల్ల లిక్కర్పై ఆదాయం 27 శాతం పెరిగిందని, రూ.8,900 కోట్ల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
- కేజీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిం చింది. నివాస గృహాల మధ్య విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని, ఢిల్లీకి లిక్కర్ సంస్కృతిని తీసు కొచ్చారని ఢిల్లీ బీజేపీ నాయకులు ఆరోపించారు.
- కొత్త మద్యం విధానంలో చాలా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, ప్రైవేట్ లైసెన్స్ దారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని స్పష్టం చేస్తూ 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ ఒక నివేదిక విడుదల చేశాడు. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రైవేట్ వ్యాపారులకు ప్రభుత్వం రూ.144 కోట్ల మేర లైసెన్స్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని వెల్లడించాడు.
- ప్రధాన కార్యదర్శి నివేదికపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించి ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ జరపాలంటూ సిఫార్సు చేశాడు. తమపై వస్తున్న ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టిపారేశారు. తర్వాత కొన్ని రోజులకే నూతన లిక్కర్ పాలసీని కేజ్రివాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 400 మద్యం దుకా ణాలు మూతపడ్డాయి. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి.
- లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు మేరకు లిక్కర్ స్కామ్పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2022 ఆగస్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా నివాసంతోపాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, ఈ సోదాల్లో సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదని మనీష్ సిసోడియా చెప్పాడు. తమ పార్టీని ఆప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు.
- ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్(ఈడీ) గుర్తించింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది.
- తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూప్ కు లబ్ది చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజీవాల్ ప్రభుత్వం రూపొందించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్ గ్రూప్ కు పెద్ద ఎత్తున లైసెన్స్ దక్కినట్లు తేల్చింది.[7]
- తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించినందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్లు తెలియజేసింది. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం ద్వారా సౌత్ గ్రూప్ ఈ రూ.100 కోట్లు తిరిగి రాబట్టుకున్నట్లు పేర్కొంది. నూతన లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈడీ తేల్చిచెప్పింది.
- ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ పిళ్ సమీర్ మహేంద్రు, పి. శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మాగుంట రాఘవ. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. వీరిలో అరుణ్ పిళ్లె, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు, పి. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు.[8] ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను 2024 మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది.
అరెస్టుల చేసిన జాబితా
[మార్చు]ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 16 మందిని అరెస్టు చేశారు.
పేరు | చిత్తరువు | పార్టీ | అరెస్టు తేదీ |
---|---|---|---|
అరవింద్ కేజ్రీవాల్ | ఆమ్ ఆద్మీ పార్టీ | 2024 మార్చి 21[9] | |
కల్వకుంట్ల కవిత | భారత రాష్ట్ర సమితి | 2024 మార్చి 15 | |
మనీష్ సిసోడియా | ఆమ్ ఆద్మీ పార్టీ | 2023 ఫిబ్రవరి 26[10] | |
సత్యేంద్ర కుమార్ జైన్ | ఆమ్ ఆద్మీ పార్టీ | 2022 మే 30.[11] |
మూలాలు
[మార్చు]- ↑ "Delhi Excise Scam: ED raids multiple locations across India". mint (in ఇంగ్లీష్). 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "Delhi Excise Policy: NDMC to Bring Censure Motion in Aug 24 Meeting". News18 (in ఇంగ్లీష్). 2022-08-23. Retrieved 2022-09-06.
- ↑ "Delhi Excise Policy | Aam Aadmi Party alleges 'corruption' in change of decision by Centre's LG; seeks CBI probe". The Hindu (in Indian English). 2022-08-06. ISSN 0971-751X. Retrieved 2022-09-06.
- ↑ "Explained: All about Delhi reverting to its old liquor policy from Sept 1". The Indian Express (in ఇంగ్లీష్). 2022-08-31. Retrieved 2022-09-06.
- ↑ Pandey, Munish Chandra (August 25, 2022). "High on liquor policy: Retail margins up by 989 per cent under Delhi's new excise rules, show probe papers". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-09-06.
- ↑ News18 తెలుగు (26 February 2023). "డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ETV Bharat News (21 December 2022). "దిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ ఛార్జిషీట్‌లో కవిత, మాగుంట, శరత్‌రెడ్డిల పేర్లు". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ NTV Telugu (22 March 2024). "18 నెలల్లో 16 మంది అరెస్ట్.. లిక్కరు కేసులో ఇప్పటివరకు జైలుకు వెళ్లింది ఎవరంటే ?". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ Eenadu (21 March 2024). "సీఎం కేజ్రీవాల్ అరెస్టు.. దిల్లీలో టెన్షన్ టెన్షన్". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
- ↑ A. B. P. Desam (26 February 2023). "ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ V6 Velugu (30 May 2022). "ఢిల్లీ ఆరోగ్యమంత్రి అరెస్ట్" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)