యశ్ పాల్
Yashpal యశ్ పాల్ | |
---|---|
యశ్ పాల్ | |
జననం | 1971 సెప్టెంబరు 25 |
జాతీయత | భారతీయుడు |
విద్య | పి.జి |
వృత్తి | కవి, గాయకుడు, జర్నలిస్టు |
తల్లిదండ్రులు | తల్లి సుక్కమ్మ, తండ్రి వీరస్వామి |
యశ్ పాల్ ఖమ్మం జిల్లాలో పుట్టిన వాగ్గేయకారుడు, కవి, గాయకుడు అతనో ఓ ఉద్యమ గళం.. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[1]
తల్లిదండ్రులు
[మార్చు]యశ్ పాల్ 1971 సెప్టెంబరు 25న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం (రూరల్) మండలంలోని, కొండాపురం గ్రామంలో జన్మించాడు. తల్లి సుక్కమ్మ, తండ్రి వీరస్వామి. తన అక్క శాంతమ్మ. యశ్ పాల్ పుట్టింది పోరాటాల పురిటి గడ్డ. ఖమ్మంలోని పోచారంలో ప్రాథమిక విద్యను అభ్యసించి, మహబూబాబాద్‌లో డిగ్రీ చేసి, తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంసీజే, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టాలు పొందాడు. పి.జి వరకు చదువుకున్న యశ్ పాల్ కు పాటలంటే ప్రాణం. తన అక్క శాంతమ్మ పాటలకు ఆసక్తిగా సాహిత్యం వైపు అడుగులేసాడు.
పలు ఉద్యమాల్లో
[మార్చు]కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తూ, అరుణోదయ సాంస్కృతిక విభాగంలో పనిచేస్తూ తెలంగాణా ఉద్యమాన్ని ఉరుకుల పెట్టించే పాటలు రాసిండు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500ల పైచిలుకు పాటలు రాసిండు..ప్రతి పాటా ఒక సందేశమిచ్చేదే. యశ్ పాల్ పాటల్లో సాహిత్యం కంటే ఎక్కువ ప్రజల జీవితం ఉంటది. ఆవేదన ఉంటది. అణిచివేత పై ధిక్కారం ఉంటది. యశ్ పాల్ పాటల్లో వర్తమానం, చరిత్రల మేళవింపు ఉంటుంది. గ్లోబలైజేషన్ పై ఎక్కుపెట్టిన అస్ర్రాలు యశ్ పాల్ అక్షరాలు. పండుటాకులా ఎండిపోతున్న కులవృత్తులగురించి, గ్రామీణ ఆట పాటపై ఎన్నో పాటలు రాసిండు. యశ్ పాల్ పాటల్లో అమరులు నిద్దుర లేస్తరు. చుక్కలై వెలుగులు చిందుతరు. అవిసి పోతున్న ఆటపాటల పై యశ్ పాల్ రాసిన పాటలు గ్రామీణ జీవితం కళ్లముందు కదలాడుతది.
సినిమాల్లోను
[మార్చు]యశ్ పాల్ ఒక కవిగానే కాక గాయకుడిగా కూడా ప్రపంచానికి పరిచయం. యశ్ పాల్ సాహిత్యాన్ని మెచ్చుకున్న ఎందరో సినీ దర్శకులు తమ సినిమాల్లో పాటలు ప్రజాచైతన్య గీతాలు రాయించుకున్నరు. ఒక రచయిత గానే కాక తెలంగాణ ఉద్యమాల్లో, బీడీ కార్మికులు సమస్యలపై, మహిళల అణిచి వేతపై, ప్రత్యక్షంగా పాల్గొన్నడు. వలసలను నివారించేందుకు, ప్రాజెక్ట్ నిర్వాసితుల రక్షణకోసం చేసిన పోరాటాలలో ప్రత్యక్షం పాల్గొని అనేక సందార్భాలలో పోలీసు లాఠీల దెబ్బలు తిన్నడు. అరెస్టయినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమంలో తన తోటి వారికి ఆదర్శంగా నిలిచిండు. 2000లో వచ్చిన ‘ఛలో అసెంబ్లీ’ సినిమాలో ‘సిరిగల్లా భారతదేశం తమ్ముడా! తాకట్టు పెట్టబడ్డదీ తమ్ముడా!’, ‘పొద్దు పొద్దున లేసి పొద్దున్నాలేసి మా కంటిపాపల్లారా!’ అనే పాటలతో చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.[2]
గ్రామీణ సంస్కృతులను
[మార్చు]ఉద్యమానికి సహకరించడం ఒక వంతయితే, కనుమరుగై పోతున్న గ్రామీణ సంస్కృతులను, సాహిత్యం కళలు, జానపదాలను సేకరించి ముందు తరాలకు వాటి గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నడు. రైతు ఆత్మ హత్యల పై, బీడి కార్మికుల వెతలపై, మధ్యానికి బానిసై చిద్రమవుతున్నకుటుంబాలపై, నేత కార్మికులు కడగండ్ల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే యశ్ పాల్ తడమని సమస్య లేదు. రాయని తండ్లాట లేదు.
మలి విడత ఉద్యమంలో
[మార్చు]మలి విడత తెలంగాణ ఉద్యమంలో యశ్ పాల్ పాత్ర మరువలేనిది. ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి కాలం పనిచేసి నిత్యం విద్యార్థులను చైతన్య పరుస్తూ తన పూర్తి సమయాన్ని ఉద్యమానికి అంకితం చేసిండు. అనే క ధూంధాంలలో పాల్గొని ఉద్యమానికి తన వంతు సేవ చేసిండు.
జర్నలిస్టు
[మార్చు]ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.[3]
కొన్ని సినిమా పాటలు
[మార్చు]- ఛలో అసెంబ్లీ (2000): ‘సిరిగల్లా భారతదేశం తమ్ముడా! తాకట్టు పెట్టబడ్డదీ తమ్ముడా!’, ‘పొద్దు పొద్దున లేసి పొద్దున్నాలేసి మా కంటిపాపల్లారా!’
- నిర్భయ భారతం (2013): ‘కొండా కొండల నడుమ కొండల్లా నడుమ’
- జై తెలంగాణ (2012): ‘వీరుల్లారా! వీరవనితల్లారా! అమ్మ రుణముకై రణములొరిగినార!’, ‘జై జై బోలో తెలంగాణ జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో’
- దండకారణ్యం (2016): ‘జై బోలో జనతన్ సర్కార్.. జై బోలో రే.. వ్యవసాయక్షేత్రాలెట్టి దళారులు లేని మార్కెట్లే వెలసే’
మూలాలు
[మార్చు]- ↑ Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 1 October 2021.
- ↑ "ఉద్యమాల వందనాలు." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-27. Archived from the original on 2021-03-28. Retrieved 2021-12-13.
- ↑ "- YouTube". YouTube.
బయటి లింకులు
[మార్చు]- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- సాహిత్య విమర్శకులు
- హిందూ రచయితలు
- విప్లవ రచయితలు
- తెలుగు కళాకారులు
- తెలుగు జానపద కళాకారులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- తెలుగు సినిమా గాయకులు
- భారతీయ జానపద గాయకులు
- ఖమ్మం జిల్లా ప్రజానాట్యమండలి కళాకారులు
- ఖమ్మం జిల్లా గాయకులు
- ఖమ్మం జిల్లా రచయితలు