శివానంద లహరి
Jump to navigation
Jump to search
శివానంద లహరి ఆది శంకరాచార్యులు శివుడిని ప్రస్తుతిస్తూ రాసిన స్తోత్రం.[1] శివానంద లహరి అంటే శుభప్రదమైన ఆనంద తరంగాలు అని అర్థం. ఇందులో 100 సంస్కృత శ్లోకాలు వివిధ చందస్సులో కూర్చబడ్డాయి. ఈ స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉండగా రాశారని ప్రతీతి. శ్రీశైలంలో కొలువున్న మల్లికార్జునుడు, భ్రమరాంబికా దేవి స్తుతితో ఇది ప్రారంభం అవుతుంది.[2][3]
ఈ స్తోత్రాన్ని కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం తెలుగులోకి అనువదించి 1916లో ప్రచురించాడు.[4]
స్తోత్రం
[మార్చు]ఈ స్తోత్రం మొదటి శ్లోకం ఇలా ఉంటుంది.[5]
కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది
పునర్భవాభ్యామానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sivanandini Duraiswamy (2006). The Footfalls on Time. Vijitha Yapa Publications. p. 169. ISBN 978-955-1266-29-5.
- ↑ Tapasyananda (2002). Sankara-Dig-Vijaya: The Traditional Life of Sri Sankaracharya by Madhava-Vidyaranya. India: Sri Ramakrishna Math. pp. 130–135. ISBN 978-81-7120-434-2.
- ↑ Shantha N. Nair (2009). The Lord Shiva. Pustak Mahal. pp. 113–. ISBN 978-81-223-1039-9.
- ↑ Balijepalli Laxmikantam (1916). Sri Shivananda Lahari (in Telugu). Guntur: Chandrika Mudraksharasala. Retrieved 8 September 2020.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Tapasyananda, Swami (2022-05-05). Sivananda Lahari of Sri Sankaracarya (in ఇంగ్లీష్). Sri Ramakrishna Math. p. 12.