Jump to content

మాతా అమృతానందమయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Created page with ''''మాతా అమృతానందమయి''' (జననం: 1953 సెప్టెంబరు 27) భారతదేశంలోని తమిళ...'
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
(తేడా లేదు)

04:51, 27 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

మాతా అమృతానందమయి (జననం: 1953 సెప్టెంబరు 27) భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న అమృత విశ్వ విద్యాపీఠం అనే ప్రైవేటు విశ్వవిద్యాలయమునకు ఛాన్సలర్. ఈమె అసలు పేరు సుధామణి ఇడమాన్నేల్. ఈమె ఒక హిందూ ఆధ్యాత్మిక నేత మరియు బోధకురాలు. ఈమెను "అమ్మ", "అమ్మాచి" అని కూడా పిలుస్తారు. మానవతా కార్యక్రమాలు ద్వారా ఈమె ప్రసిద్ధి చెందారు. 1953లో కేరళ రాష్ట్రంలోని కొల్లామ్ జిల్లాలో అలప్పాడ్ పంచాయితీలో ఉన్న పారాయకాడవు (ఇప్పుడు కొందరు ఈ గ్రామాన్ని అమృతపురిగా గుర్తిస్తున్నారు) అనే కుగ్రామంలో ఈమె జన్మించారు. మాతా అమృతానందమయి 'ది స్టేట్ ఆఫ్ న్యూయార్క్, యూనివర్శిటీ' గౌరవ డాక్టరేట్ కోసం ఎంపికయ్యారు. న్యూయార్క్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో అమ్మ‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. మాతా అమృతానందమయి చేసిన మానవతా సేవలకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు ఛాన్సలర్ డాక్టర్ స్టీవెన్ డీసెట్ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

పదవులు

  • మాతా అమృతానందమయి మఠం వ్యవస్థాపకురాలు & ఛైర్‌పర్సన్
  • ఎంబ్రేసింగ్ ది వరల్డ్ వ్యవస్థాపకురాలు[1]
  • అమృత విశ్వ విద్యాపీఠం విశ్వవిద్యాలయ ఛాన్సెలర్[2]
  • అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS హాస్పిటల్) వ్యవస్థాపకురాలు[3]
  • పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్స్ రిలీజియన్స్, అంతర్జాతీయ సలహా కమిటీ సభ్యురాలు[4]
  • ది ఎలిజా ఇంటర్‌ఫెయిత్ ఇన్‌స్టిట్యూట్, ఎలిజా బోర్డ్ ఆఫ్ వరల్డ్ రిలీజియస్ లీడర్స్ సభ్యురాలు [5]

పురస్కారాలు మరియు గౌరవాలు

  • 1993, 'ప్రెసిడెంట్ ఆఫ్ ది హిందూ ఫెయిత్' (పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్స్ రిలీజియన్స్) [6]
  • 1993, హిందూ పునరుజ్జీవన అవార్డు (హిందుయిజం టుడే ) [7]
  • 1998, కేర్ & షేర్ ఇంటర్నేషనల్ హ్యూమేనిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ (చికాగో)
  • 2002, కర్మ యోగి ఆఫ్ ది ఇయర్ (యోగా జర్నల్ ) [8]
  • 2002, గాంధీ-కింగ్ అవార్డు ది వరల్డ్ మూమెంట్ ఫర్ నాన్‌వాయిలెన్స్ అంహిసను ప్రోత్సహించినవారికి ఈ అవార్డు ఇస్తుంది (యుఎన్, జెనీవా) [9] · [10]
  • 2005, మహావీర్ మహాత్మా అవార్డు (లండన్) [11]
  • 2005, సెంటెనరీ లెజెండరీ అవార్డ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రొటేరియన్స్ (కొచ్చిన్) [12]
  • 2006, జేమ్స్ పార్క్స్ మోర్టాన్ ఇంటర్‌ఫెయిత్ అవార్డు (న్యూయార్క్) [13]
  • 2006, ది ఫిలాసఫర్ సెయింట్ శ్రీ జ్ఞానేశ్వరా వరల్డ్ పీస్ ప్రైజ్ (పూణే) [14]
  • 2007, లి ప్రిక్స్ సినిమా వెరైటీ (సినిమా వెరైటీ, ప్యారిస్) [15]
  • 2010, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ ఆమెకు హ్యూమన్ లెటర్స్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది, దీనిని బఫెలో ప్రాంగణంలో 2010 మే 25న ఆమె అందుకున్నారు.[16]

మూలాలు