అంగీరసులు
(అంగిరసుఁడు నుండి దారిమార్పు చెందింది)
అంగీరసులు వీరు అంగీరిస వంశానికి చెందిన పురాణ పురుషులు. [1] పురాణ కథనం ప్రకారం శ్రీహరి బొడ్డునుండి బ్రహ్మ జన్మించాడు.ఈ బ్రహ్మ కుమారుడు అంగీరసుడు. ఆ అంగీరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తెయగు శ్రద్ధను వివాహం చేసుకున్నాడు.కాలక్రమంలో ఆ దంపతులు ఏడుగురు కుమారులకు, ఏడుగురు కుమార్తెలకు జన్మనిస్తారు. వారివల్ల అంగీరసుని వంశం పెరిగి విశ్వమంతా ప్రాకింది.వీరిని అంగీరసులు ఉంటారు.[2]
పురాణ కథనాలు
[మార్చు]- బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూతురును కలిగారు. ఈ యోగసిద్ధి అష్టవసువులలో ఒకడగు ప్రభాసుని వివాహము చేసికొని అతనియందు విశ్వకర్మను కన్నాడు. తొల్లి అగ్నిదేవుఁడు దేవతలతోడి యలుకచే హవ్యంబుల వహింపనొల్లక వనమునకు చన దేవతలు అధికతపోవిజృంభితుఁడగు అంగిరసుని అగ్నిపదమునందు ఉంచిరి. అంత కొంతకాలమునకు వెనుక అగ్ని మరలి రాఁగా అంగిరసుడు అతనిని ప్రథమాగ్నియయి ఉండుమని తాను అతనికి ప్రథమపుత్రుడయి అగ్నిసారూప్యమున తేజరిల్లె. ఈరూపమున ఇతనికి శివ అను భార్యయందు బృహజ్జ్యోతి, బృహత్కీర్తి, బృహన్ముఖుఁడు, బృహన్మతి, బృహద్భానుఁడు, బృహస్పతి, బృహద్బ్రహ్మ అను నేడుగురు కొడుకులును, అనుమతి, రాక, సినీవాలి, కుహువు, అర్చిష్మతి, హవిష్మతి, మహామతి అను నేడుగురు కూఁతులును పుట్టిరి. వీరును వీరి సంతతివారందఱును అగ్నిస్వరూపులయి ఉందురు.
- అంగిరస: చాందోగ్యోపనిషత్తు ప్రకారం ఇతని పేరుమీదనే ముఖ్య ప్రాణమును అంగిరసము అని ఋషులు పిలుస్తారు. అంగీరసులకు మొదటి మూల పురుషుడు
- అంబరీషుని మునిమనవలను అంగీరసులని అంటారు. వీరు అంబరీషుని మనుమడైన హరితుని కుమారులు. నాగలోకానికి వెళ్ళి పాములను హింసిస్తూ ఉంటే నాగులు వెళ్ళి పురుకుత్సుని వేడుకోగా అతను వీరిని నాగలోకం నుండి వెళ్ళగొట్టాడని విష్ణు పురాణం కథ.
- ఉల్ముకుని కొడుకు. అంగుని తమ్ముఁడు.
మూలాలు
[మార్చు]- ↑ Turner, p. 53.
- ↑ Brough, John (2013-09-26). The Early Brahmanical System of Gotra and Pravara: A Translation of the Gotra-Pravara-Manjari of Purusottama-Pandita (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 978-1-107-62398-9.
వెలుపలి లంకెలు
[మార్చు][[వర్గం:పురాణ పాత్రలు]]