అంతం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతం
Antham.jpg
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
నిర్మాతకె. ప్రసాద్ (నిర్మాత), బోనీ కపూర్ (సమర్పణ)
నటవర్గంనాగార్జున, ఊర్మిళ
ఛాయాగ్రహణంతేజ
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
దృశ్య క్రియేషన్స్
విడుదల తేదీలు
1992 సెప్టెంబరు 11 (1992-09-11)
భాషతెలుగు

అంతం 1992 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో నాగార్జున, ఊర్మిళ ప్రధాన పాత్రలు పోషించారు. శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన రెండో సినిమా ఇది.[1] ఇందులో పాటలు జనాన్ని ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇదే సినిమాను హిందీలో నాగార్జునతోనే ద్రోహి గా రూపొందించారు.[1]

తారాగణం[మార్చు]

  • నాగార్జున
  • ఊర్మిళ
  • డానీ
  • సలీం గౌస్
  • ఆకాశ్ ఖురానా
  • డబ్బింగ్ జానకి
  • రాళ్ళపల్లి
  • గోకిన రామారావు
  • సిల్క్ స్మిత

చిత్రీకరణ[మార్చు]

ఈ సినిమాలో కొంతభాగం శ్రీలంక లో చిత్రీకరించబడింది.[1]

పాటలు[మార్చు]

ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. చలెక్కి ఉందనుకో అనే పాటను మణిశర్మ రూపొందించగా, గుండెల్లో దడ దడ అనే పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చాడు. మిగతా నాలుగు పాటలు ఆర్. డి. బర్మన్ స్వరపరిచాడు. అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు. నేపథ్య సంగీతం మణిశర్మ అందించాడు. మణిశర్మకు టైటిల్ కార్డు పడ్డ తొలిచిత్రం కూడా ఇదే.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "నాగార్జున 'అంతం' చిత్రానికి పాతికేళ్లు పూర్తి". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 16 October 2017.[permanent dead link]


బయటి లింకులు[మార్చు]