Jump to content

అంతర్గత కాలము

వికీపీడియా నుండి



In some diseases, as depicted in this diagram, latent period is shorter than incubation period. A person can transmit infection without showing any signs of the disease. Such infection is called subclinical infection.

అంటు వ్యాథులలో అంతర్గత కాలము అనగా నేమి?

[మార్చు]

అంతర్గత కాలము

[మార్చు]

వివిధ జాతుల సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించిన వెంటనే వ్యాధి బయలు పడదని ఇదివరలో సూచించి యున్నాము. మన శరీరములో ప్రవేశించిన సూక్ష్మ జీవుల సంఖ్య మొదట మిక్కిలి తక్కువగ నుండి అవి గంట గంటకు మన శరీరములో పెరిగి వందలు వందలుగ పిల్లలను పెట్టి తుదకు కొన్ని దినములలోనే లక్షల కొలది, కోట్ల కొలది యగును. మనశరీరములో సూక్ష్మ జీవులు ప్రవేశించినది మొదలు అంటు వ్యాధి యొక్క మొదటి చిహ్నము అగు జ్వరము, తల నెప్పి మొదలగునవి ఎవ్వియైనను కనబడు వరకు పట్టు కాలమునకు అంతర్గత కాలము (incubation period) దీనినే కొందరు ఉద్భూత కాలమను చున్నారు. ఈ యంతర్గత కాలము కొన్ని వ్యాధులలో మిక్కిలి తక్కువగ నుండును. మరికొన్ని వ్యాధులలో పది లేక పదునైదు దినములు పట్టును. ఇది ఆ యాజాతి సూక్ష్మ జీవులు పెరుగు పద్ధతిని బట్టియు, రోగి యొక్క బలాబలము బట్టియు, మారు చుండును. అంతర్గత కాలములో రోగికి ఫలాని వ్యాధి శోకినదని ఎంత మాత్రము తెలియదిని చెప్పపచ్చును. ఒక్కొక్క వ్యాధి యొక్క అంతర్గత కాలము తెలిసి కొనుటలో అనేక సందిగ్ధాంశములు గలవు.

1. ఏ దినమున సూక్ష్మ జీవులు శరీరములో ప్రవేశించినవో చెప్పుట కన్ని సమయములందును వీలుండదు. ఒకానొకప్పుడు రోగి యుండు స్థలమునకు చుట్టు ప్రక్కల నెక్కడను ఆ వ్యాధి శోకిన వారలు మనకు తెలియ పోవచ్చును. మిక్కిలి ముమ్మరముగ వ్యాధి వ్యాపించి యున్న ప్రదేశములలో ఏచోట నుండి రోగి తన వ్వాధిని అంటించుకొనెనో మనకు తెలియ పోవుట చేత రోగము సోకిన కాలము సరిగా మనము నిర్ణయింప లేక పోవచ్చును.

2. రోగి, తన బట్టల మీదా గాని, శరీరము మీద గాని, వ్యాధిని గలిగించు సూక్ష్మ జీవులను మోసికిని పోవుచున్నను, కొన్ని దినములైన తరువాత ఆని అవి తమ వాహకునికి సోకక పోవచ్చును. అందుచే అంతర్గత కాలము హెచ్చుగ నున్నట్లు మనకు లెక్కకు వచ్చును.

3. క్షయ, కుష్ఠు రోగము మొదలగు కొన్ని వ్యాధులు కొద్ది కొద్దిగా శరీరము నంటినను అవి రోగికి తెలియకుండ చిర కాలము వరకు శరీరములో దాగి యుండ వచ్చును.

4. ఇద్దరు ముగ్గురు రోగులు ఒక యింటిలో నొక వ్వాధి యొక్క విదిధావస్తలలో నున్నప్పుడు వారిలో ఒకరి నుండి ఇతరులకు వ్యాధి సోకిన యెడల ఎవరి నుండి క్రొత్తవారికి వ్యాధి సోకినది తెలియక పోవుట చేత క్రొత్త రోగి యొక్క అంతర్గత కాలము కనుగొనుట కష్టము.

5. ఇది గాక, అంతర్గత కాలము రోగి యొక్క శరీర బలమును బట్టియు, శరీరములో ప్రవేశించిన సూక్ష్మ జీవుల సంఖ్యను బట్టియు, మారుచుండునని చెప్పి యుంటిమి. సూక్ష్మజీవులు మిక్కిలి తక్కువగ ప్రవేశించిన యెడల వ్యాధి పెంపు తక్కువగ నుండును. అప్పుడు అంతర్గత కాలము ఎక్కువ కావచ్చును. ఒక్కొక్కప్పుడు రోగి బలమయిన వాడైన యడల వ్యాధి బయట పడక పోవచ్చును. సూక్ష్మ జీవుల మోతాదు హెచ్చిన కొలదిని రోగి బలహీనుడైన కొలదిని రోగము మిక్కిలి తీవ్రముగను, శీఘ్రముగను పరిణమింప వచ్చును. అప్పుడు అంతర్గత కాలము తగ్గిపోవును. సూక్ష్మ జీవులు కొంత వరకు శరీరములో నున్నను, వ్యాధి పైకి తెలియక పోవచ్చుననుటకొక నిదర్శనము చెప్పెదము. రమారమి లక్ష నెత్తురు కణముల కొక్క చలి జ్వరపు పురుగు చొప్పున మన శరీరములో నున్నప్పుడే జ్వరము పైకి కనబడును. కాని లక్ష కొక్కటి కంటే చలి జ్వరపు పురుగులు తక్కువగ నున్న యెడల జ్వరము బయటకు రాదు. సాధారణముగా మన దేశమున వ్యాపించి యుండు అంటు వ్వాధుల యొక్క అంతర్గత కాలమును వ్యాధి యొక్క సూచనలు కొన్ని బయట పడిన తరువాత అది ఫలానా వ్వాధి యని నిశ్చయముగ తెలిసికొనుట కెన్నటికి సాధ్యమగునో ఆదినము యొక్క సంఖ్యయు, వ్యాధి యొక్క ప్రారంభించు దిన సంఖ్యయు వ్యాధి పీడితుడగు రోగితో నెన్ని దినములవర కితరులు సంపర్కము కలిగి యుండ కూడదో ఆ దినముల సంఖ్య, వ్వాధి కుదిరిన పిమ్మట రోగిని శ్వేఛ్చగ నితరులతో నెప్పుడు కలిసి మెలసి తిరుగనియ్య వచ్చునో ఆదినముల సంఖ్యయు తెలియ జేయు పట్టీ నొక దానినీక్రింద చేర్చి యున్నాము.

పట్టిక

[మార్చు]