అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం
అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం
యితర పేర్లుఅణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు
జరుపుకొనే రోజుఆగస్టు 29
ఉత్సవాలుఐక్యరాజ్య సమితి
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతిరోజు ఇదే రోజు

అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణుపరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది.

ప్రారంభం

[మార్చు]

2009, డిసెంబరు 2న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 64వ సెషన్ లో 64/35 తీర్మానం ద్వారా ఈ దినోత్సవం ప్రతిపాదించబడి, ఏకగ్రీవంగా ఆమోదించబడింది.[1]

"అణుపరీక్షలోని పేలుళ్ళు, ఇతర అణు పేలుళ్ళ ప్రభావాల గురించి, అణ్వాయుధ రహిత ప్రపంచం లక్ష్యాన్ని సాధించే సాధనాల్లో ఒకటైన ఈ అణుపరీక్షలను నిలిపివేయవలసిన అవసరాన్ని గురించి" అవగాహన పెంచాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది.[1] 1991, ఆగష్టు 29న సెమిపలాటిన్స్క్ న్యూక్లియర్ టెస్ట్ సైట్ మూసివేయబడిన రోజు జ్ఞాపకార్థంగా అనేక మంది స్పాన్సర్లు, కోస్పాన్సర్లతో కజకస్తాన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది.

అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ఏర్పాటుచేసిన తరువాత 2010, మే నెలలో అణ్వాయుధాల వ్యాప్తి నిరోధకతపై ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు "శాంతి భద్రతలను సాధించడం కోసం అణ్వాయుధాలు లేని ప్రపంచానికి" తమకు తాము కట్టుబడి ఉన్నాయి.[1]

సమావేశాలు

[మార్చు]

ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్, గ్రీన్ క్రాస్ ఇంటర్నేషనల్, కెనడా రాయబార కార్యాలయం, అణు ప్రాజెక్ట్ సహ-స్పాన్సర్‌షిప్‌లో యునైటెడ్ స్టేట్స్‌లోని కజకిస్తాన్ రాయబార కార్యాలయంలో 2014 సెప్టెంబరు 15న "అణు ఆయుధాల పరీక్ష: చరిత్ర, పురోగతి, సవాళ్లు" అనే అంశంపై అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం జ్ఞాపకార్థంగా ఒక సమావేశాన్ని నిర్వహించింది. వాషింగ్టన్, డి.సి.లోని యునైటెడ్ స్టేట్స్ శాంతి ఇన్స్టిట్యూట్ వద్ద ఈ సమావేశం జరిగింది. అణ్వాయుధ పరీక్ష, సమగ్ర అణు-పరీక్ష-నిషేధ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్ళే మార్గాలపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఈ సమావేశంలో యుఎస్ ఇంధన సెక్రటరీ ఎర్నెస్ట్ జె. మోనిజ్ కీలకొపన్యాసకులుగా, యు.ఎస్. అండర్ సెక్రటరీ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ రోజ్ ఇ. గొట్టెమోల్లెర్, యు.ఎస్. అండర్ సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ, ఎన్ఎన్ఎస్ఎ అడ్మినిస్ట్రేటర్ ఫ్రాంక్ జె. క్లోట్జ్, సిఇబిటిఓ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి లాసినా జెర్బో మొదలైనవారు పాల్గొని అణ్వాయుధ వ్యాప్తికి తమ నిబద్ధతను చాటిచెప్పారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "International Day against Nuclear Tests". United Nations. Retrieved 2020-08-29.

ఇతర లంకెలు

[మార్చు]