Jump to content

అంతర్జాతీయ తెలుగు సంబరాలు - 2022

వికీపీడియా నుండి
తెలుగు తల్లి

అంతర్జాతీయ తెలుగు సంబరాలు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ సంస్థ ఆధ్వర్యంలో 2022 జనవరి 6,7,8 తేదీలలో నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకలు తెలుగు సాహితీవేత్తలు, కళాకారులు, తెలుగు భాషా వికాస సంస్థల సమన్వయంతో వెస్ట్ బెర్రి విద్యాలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సంబరాలు జరగనున్నాయి.[1]

కార్యక్రమ కాల పట్టిక

[మార్చు]
  • జనవరి 3న భీమవరంలో తెలుగు భాష వైభవ శోభాయాత్ర.
  • జనవరి 6న ప్రాచీన కవులు, రాజవంశీయుల కుటుంబీకులకు ఆంధ్ర వాయ పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేయుటకు సదస్సు ఏర్పాటు.
  • జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగింపు సభ, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు.[2]

కార్యక్రమ నిర్వహణ

[మార్చు]
  • అధ్యక్షులు - గజల్ శ్రీనివాస్
  • ఉపాధ్యక్షులు - గురు సహస్రావధాని డా.కడిమిళ్ళ వరప్రసాద్, రెడ్డప్ప ధవేజీ, మహేశ్ వర్మ, కంతేటి వెంకట్రాజు, పొన్నపల్లి శ్రీరామరావు, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, ఆరేటి ప్రకాష్.
  • గౌరవ అధ్యక్షులు - భీమవరం ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు.
  • కమిటీ సభ్యులు - రాయప్రోలు భగవాన్, కేశిరాజు రామ్‌ప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాస్, బి.రాంబాబు, లక్ష్మణ వర్మ, మంతెన రామ్‌కుమార్‌ రాజు, మేడికొండ శ్రీనివాస చౌదరి, జ్యోతి రాజ్, ఒడుపు గోపి, మహేష్‌.[3]

సౌకర్యాలు

[మార్చు]

దేశ విదేశాలనుంచి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, రవాణా, భోజన సదుపాయం.

మూలాలు

[మార్చు]
  1. "భీమవరం పట్టణంలో జనవరి 6,7,8 తేదీల్లో తెలుగు సంబరాలు". తెలుగు టైమ్స్.
  2. "భీమవరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు". ఈనాడు.
  3. "జనవరి 6 నుంచి అంతర్జాతీయ తెలుగు సంబరాలు". సాక్షి.