అందమైన జీవితం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అందమైన జీవితం
Andamaina Jeevitam.jpg
కృతికర్త: మల్లాది వెంకట కృష్ణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): నవల
ప్రచురణ:
విడుదల: 2010

అందమైన జీవితము ఒక తెలుగు నవల. ఈ నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ఇది స్త్రీ పురుషుల మధ్య సెక్స్ కి దారితీయని సుగంధ స్నేహ సుధ సాధ్యమని నిరూపించే నవల[1]. చిన్న చిన్న సరదాలతో నిండిన జీవితమే అతి పెద్ద ఆనందం అన్న మెసేజ్ నిచ్చే దీంట్లో, జీవితాలను ప్రభావితం చేసే ఆర్ద్రత చూడవచ్చు. నల్లేరు మీద నడకలా సాగే మధ్య తరగతి జీవితాల్లో గోప్యంగా ఉండే మృదువైన సెంట్ మెట్స్ ని శాంతి, ప్రియతమ్ పాత్రల ద్వారా మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇందులో సూటిగా చెప్పారు. స్పందన, భావావేశం గల పాఠకులందరికి ప్రియమైన నవల "అందమైన జీవితం."


చరిత్ర[మార్చు]

అందమైన జీవితమ్ నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి ఎనబైయవ దశకములొ వ్రాసారు. ఇది తొలుత సీరియల్‌గా ప్రచురించబడింది. ఆ తరువాత నవలగా ముద్రించబడింది. 2010లో చివరి ముద్రణ వచ్చింది. ఆ తరువాత 2011లో కిగిగెపై డిజిటల్ పుస్తకంగా వచ్చింది. ఈ నవల మల్లాది నవలల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నవల. యండమూరి వీరేంద్రనాథ్ మల్లాది నవలల్లో తనకు నచ్చిన నవలగా ఈ నవల పేరు చెప్పారు. [2].

మూలాలు[మార్చు]

  1. http://kinige.com/kbook.php?id=52
  2. http://pustakam.net/?p=2249